ఏపీలో ప్రస్తుతం చేపడుతున్న సమగ్ర భూ సర్వే అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
‘కొందరి స్వార్థం కోసమే ఈ పనులు చేస్తున్నారు. నిజంగా ఇండస్ట్రీ బాగు కోసమైతే, నన్ను పిలవక పోయినా వస్తాను. ఇండస్ట్రీ కోసం ఎన్నో చేశాను. ఇకపైనా చేస్తూనే ఉంటానని’ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna Comments) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలలో దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలోనూ భారత్‌లో అత్యుత్తమ సీఎంలలో నాలుగో స్థానం దక్కింది. కరోనా వైరస్ కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు వైఎస్ జగన్.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదని, హోదా ఇస్తే రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు వచ్చేవని ఏడాది పాలన తర్వాత సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం.
YS Jagan | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. మే నెల నుంచి పూర్తి జీతాలు చెల్లించేందుకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రస్తుతం ఓ వైపు లాక్డౌన్ సమస్యలతో సమమతమవుతున్న మత్స్యకారులు ఏపీలో మూడు నెలల చేపల వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయారు. వీరి బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 వేలు జమ చేయనున్నారు
ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను సోమవారం రాజ్‌భవన్‌లో కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలను గవర్నర్‌కు ఈసీ వివరించారు.
దిశ ఘటనతో ఏపీ సర్కార్ ఏకంగా దిశ చట్టాన్నే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. రాజమండ్రిలో శనివారం దిశ పోలీస్ స్టేషన్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
Disha Police Station | యువతులు, మహిళలు, చిన్నారుల అత్యాచారాలు, అఘాయిత్యాలు అరికట్టేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
Yanamala Rama Krishnudu | శాసనమండలిని రద్దు చేసే అధికారం కేంద్రం చేతుల్లో ఉందని, పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీ యనమల వ్యాఖ్యానించారు.
ఓవైపు శాసనమండలి రద్దు దిశగా పావులు కదుపుతోన్న వైఎస్సార్ సీపీ సర్కార్.. రాజధాని అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని, పాలన ఎక్కడినుంచైనా చేయవచ్చునని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల అంశాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఏపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సమావేశం కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
సినీ ప్రపంచంలో ధ్రువతారగా వెలుగొందిన శ్రీదేవి... అందరినీ వదిలి నింగికెగశారు. ఆమె మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, సినీతారలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.