ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారులకు శుభవార్త. నేడు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 వేలు జమ చేయనున్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఈ నగదును వారికి అందించనున్నారు. ఎన్నికలకు ముందు చేసిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలసిందే. మందుబాబులకు సీఎం కేసీఆర్ హెచ్చరిక
ప్రస్తుతం ఓ వైపు లాక్డౌన్ సమస్యలతో సమమతమవుతున్న మత్స్యకారులు ఏపీలో మూడు నెలల చేపల వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయారు. వీరిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఆయా మత్స్యకారులకు వైఎస్సార్ మత్స్యకార భరోసా (#YSRMatsyakaraBharosa) భృతికి అర్హుల వివరాలను సేకరించింది. దాదాపు లక్షకు మందికి పైగా ఈ పథకం వల్ల లబ్ధి పొందనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు ఇదివరకే మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘శ్రద్ధ’ చూపుతోన్న చీర అందాలు
కాగా, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీని రూ.9కి పెంచడంతో పాటు చేపల వేటకు వెళ్లిన మత్స్సకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని చెల్లించి ఆదుకోనున్నట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణ వివరించారు. టీడీపీ హయాంలో మత్స్యకారులకు అంతగా లబ్ధి చేకూరలేదని, వారి కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!