కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు (Farm Bills) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 13 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ( GHMC Elections 2020 ) ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ను నిలువరించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్, పలు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్ (Delhi Chalo protest) నిరసన మంగళవారం కూడా కొనసాగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల (GHMC Elections 2020) ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముందుగా హోంమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
ప్రముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ (85) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గతనెలలో సౌమిత్ర ఛటర్జీకి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయిన తరువాత కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరారు.
భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ ( Lal Krishna Advani ) నేటితో 93వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అగ్రనేతకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఎల్కే అద్వానీ జన్మదినాన్ని (LK Advani Birthday) పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఈ కూటమికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యం వహించనున్నారు. అందరూ ఊహించినట్లుగానే 50:50 సీట్లను బీజేపీ, జేడీయూ పంచుకున్నాయి.
బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటివిడత నామినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే మహాకూటమి (Congress, RJD, Left) పార్టీల మధ్య సీట్ల పంపకం నిన్ననే పూర్తయింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలైన జేడీయూ, బీజేపీ ( JDU- BJP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు (President Ram Nath Kovind Birthday) నేడు (అక్టోబర్ 1). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి కోవింద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు (AP CM YS Jagan Delhi Tour). నేటి మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరనున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్ ( AIIMS )లో చేరారు. ఇటీవలనే కరోనా ( Coronavirus ) నుంచి కోలుకున్న అమిత్ షా.. అనంతరం కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి (74) మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలవారుజామున గుండెపోటు రావడంతో జయప్రకాశ్ రెడ్డి (Jaya Prakash Reddy Death ) గుంటూరులో తుదిశ్వాస విడిచారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ( Amit Shah ) ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఫోన్ చేసి పరామర్శించారు. బుధవారం అమిత్ షాకు ఫోన్ చేసిన చంద్రబాబు.. అమిత్‌షా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అమిత్ షా కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్ ( AIIMS ) లో చేరారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కరోనా బారి నుంచి కోలుకున్న అమిత్ షా శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రి (Amit Shah Admitted to Delhi AIIMS) మారినట్లు సమాచారం.
భారత్ (India) లో చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పలు పార్టీల నేతలు కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి బారిన పడ్డారు. హోంమంత్రి అమిత్ షా (.Amit Shah) సైతం రెండు వారాల క్రితం ( ఆగస్టు 2న ) కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( amit shah) కరోనా నుంచి నుంచి కోలుకున్నట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Home ministry) వెంటనే వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus positive ) అనే వార్త నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో చేర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.