మేడిగడ్డ బ్యారేజ్‌కు చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి ఘనస్వాగతం పలికారు.
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది.
గురువారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంట్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అఖిలపక్ష సమావేశంలోకి కేవలం పార్టీ అధినేతలు, అధ్యక్షులు, లేదా పార్టీ ఆదేశానుసారం వెళ్లిన ప్రజాప్రతినిధులకే అనుమతి ఉండటంతో వైఎస్సార్సీపీ ఎంపీలు హాలు బయటే ఉండి సమావేశంలో పాల్గొన్న తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం వేచిచూస్తున్నారు.
వైఎస్సార్సీపీ అగ్ర నేత విజయసాయి రెడ్డి తనపై చేసిన విమర్శలు, ఆరోపణలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు స్పందించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తాను తొలి స్పీకర్‌గా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్న కోడెల.. తనను అప్పటి అధికార, ప్రతిపక్ష నాయకులే ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆ పదవిలో కూర్చోబెట్టారని గుర్తుచేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు తిరుమలకు రానున్నారు. సాయంత్రం 4:30 గంటలకు కొలంబో నుంచి ప్రధాని మోదీ తిరుపతికి చేరుకోనున్నారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తిరుమలకు వస్తున్న నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్ర చాటుకునేలా రోజుకో సంచలనం నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ వైఎస్సార్సీపీఎల్పీ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని ప్రకటించిన వైఎస్ జగన్.. ఇచ్చిన మాటకు అనుగుణంగానే ముఖ్యమంత్రి అయిన మూడో రోజే మద్య నిషేధం దిశగా తొలి అడుగు వేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సుపరిపాలనను ఆయన వారసుడిగా వైఎస్ జగన్ కూడా అందిస్తారని, జగన్‌కు ఆ సమర్థత ఉందని లక్ష్మీపార్వతి విశ్వాసం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.