CM Jagan Plane Emergency Landing: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లగా.. విమానంలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా తిరిగి ల్యాండ్ చేశారు. గన్నవరం నుంచి విమానం టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగి ల్యాండ్ అయింది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ దారి ఇచ్చిన ( AP CM YS Jagan's convoy ) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jagan) కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP) లేఖలు రాశారు. ఢిల్లీలో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీ మాట్లాడుతూ.. ఆ లేఖల్లోని సారాంశాన్ని వెల్లడించారు.
ఆంధ్ర ప్రదేశ్‌కి మూడు రాజధానుల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేస్తూ పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్.. త్వరలోనే ఏపీ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖపట్నంకు సచివాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఏపీ సచివాలయాన్ని వైజాగ్‌కు తరలించాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.
ఏపీ అసెంబ్లీ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసన మండలి రద్దు చేయాలనే ప్రతిపాదనతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన డ్రాఫ్టు బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం.. సభకు హాజరైన 133 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. గురువారం చిత్తూరులోని పీవీకెఎన్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటన తర్వాత తొలిసారిగా విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కడ ఘన స్వాగతం లభించింది. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ అమరావతిలో రైతులు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుండగా... విశాఖలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపించింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలిసారిగా నేడు రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి నుంచి రాజధాని తరలింపు.. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు, రైతుల ఆందోళనలు వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ఆలోచనను జనసేన పార్టీ తప్పుపట్టింది. అధికార వికేంద్రీకరణ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ.. రాజధాని వికేంద్రీకరణ కాదని జనసేన పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టేందుకు చట్టాలకు మరింత పదును పెట్టారు. అత్యాచార ఘటనలు, పిల్లలపై హింసాత్మక ఘటనలను నిరోధించేందుకు చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయనున్నారు.
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచనున్నట్టు ఇటీవలే ఏపీ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పెంచిన ఛార్జీలు రేపటి నుంచే అమలులోకి రానున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ స్పష్టంచేసింది. ఈమేరకు సవరించిన చార్జీల వివరాలను తెలియజేస్తూ.. ఏపీఎస్ఆర్టీసీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
టీడీపీ రెబల్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, ఆయన తనయుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీతో పాటు స్పీకర్‌పై విమర్శలు చేస్తూ టీడీపీ సభ్యులు సభలోంచి వాకౌట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కొనియాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి కాలంలో కొందరు తన మతం, కులం గురించి మాట్లాడుతూ దారుణమైన విమర్శలు చేస్తున్నారని, వాటిని వింటుంటే బాధగా ఉంటోందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై నుండి కారు కిందపడిన ప్రమాదం ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ఏపీ సర్కార్ మరో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకుని.. అవినీతి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై ఓ నివేదిక అందించేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ (ఐఐఎం–ఎ)తో ఏపీ సర్కార్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.