GV Anjaneyulu Panchumarthi Anuradha Appointed As Chief Whips: ఆంధ్రప్రదేశ్‌లో శాసన పదవులకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవుల్లో జనసేన పార్టీ, బీజేపీలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పదవుల పందేరం ముగిసింది.
Article 370: జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370, పునరుద్ధరణ విషయమై పెద్ద రచ్చ నడిచింది. ఆర్టికల్ 370, పునరుద్ధరణ కోసం సంప్రదింపులు ప్రారంభించాలని కోరుతూ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేయడం వివాదాస్పదమైంది. ఈ తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి.
Union Minister Bandi Sanjay: కాంగ్రెస్ బరితెగించిందని.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లగా ప్రజల పరిస్థితి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందన్నారు. దక్షిణాదికి అన్యాయం పేరుతో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
BJP MP Dharmapuri Arvind Fire On Revanth Reddy Failures: హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తొక్కి పడేస్తారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ప్రకటన చేశారు. రేవంత్ పాలనపై విరుచుకుపడ్డారు.
Aleti Maheshwar Reddy Speech About Wedding: తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రానున్నాడా? రేవంత్ రెడ్డి పదవి హుష్ కాకినా? తదితర సంచలన విషయాలను బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.
YS JAGAN vs SHARMILA : వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల సంచాయితీ అసలు కారణం ఇదా..? షర్మిల జగన్ ను రాజకీయంగా కూడా విభేధించడానికి కారణం కూడా ఇదేనా..? వైఎస్ కుటుంబంలో తన ప్రాధాన్యత తగ్గిందని షర్మిల తెగ ఫీలయ్యిందా..? ఇక తనకు ఇక్కడ ఎలాగో గుర్తింపు ఉండదని భావించే షర్మిల వేరుకుంపటి పెట్టుకున్నారా..? తనతో పాటు తల్లి విజయమ్మదీ అదే భావననా అందుకే తాను కూడా షర్మిలతో చేతి కలిపిందా ...? నిన్న మొన్నటి వరకు అంతా తమదే హవా అనుకున్న షర్మిల ,విజయమ్మకు జగన్ తీరు బాధకు గురి చేసిందా.?
BJP National President: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం స్పీడప్ చేసింది. డిసెంబర్ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల వారికే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. తద్వారా ఆ రాష్ట్రాల్లో పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలుంటాయని బీజేపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.
YS Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం జగన్ కు రాజకీయంగా ఇబ్బందులు మొదలయ్యాయా..? ఇక నుంచి జగన్ కు రాజకీయంగా పెను సవాళ్లు ఎదురుకాబోతున్నాయా..? ఒక వైపు పార్టీ నుంచి నేతల వలసలు మరోవైపు అధికార పార్టీ నుంచి సవాళ్లు మధ్యలో కుటుంబ వ్యవహారాలు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయా..? ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకున్నారా..? రాజకీయ పద్మవ్యూహం నుంచి బయటపడుతారా లేకా మరో అభిమన్యుడు అవుతారా..?
KTR Vs Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు లీగల్ గా ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Sujana Chowdary :ఏపీలో ఓ ముఖ్య నేత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా..? చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ముద్ర ఉన్న ఆ నేత ఎందుకు పెద్దగా ఆక్టివ్ గా లేడు..? ఢిల్లీ కాదని ఏపీ గల్లీలో పోటీ చేసి గెలిచినా ఆ నేతకు ఆనందం లేదా..? తన సీనియారిటికీ కనీసం మంత్రి పదవఐనా దక్కాల్సింది కదా అని అనచరుల వద్ద వాపోతున్నారా..? అసెంబ్లీకీ కాకుండా పార్లమెంట్ కు పోటీ చేసినా బాగుండు అనే ఇప్పుడు ఆ నేత ఫీలవుతున్నారా..? ఇంతకీ ఎవరా నేత ..?
BJP Vs BRS : గ్రూప్ వన్ విద్యార్థుల ఇష్యూతో తమ పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకుందామనుకున్న బీఆర్ఎస్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ గండి కొట్టారా..? అంటే అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. మొత్తంగా కారు పార్టీకి దక్కాల్సిన మైలేజీని తెలంగాణ బీజేపీ కొట్టుకుపోయింది.
Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
Special Treat For AP CM Chandrababu Naidu In Haryana: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు అరుదైన గౌరవం లభించింది. వేడుకకు హాజరైన చంద్రబాబుకు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు ప్రత్యేకంగా ఆహ్వానం పలికి ప్రత్యేక కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది చూసి టీడీపీ నాయకులు, కూటమి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu Naidu: కేంద్రంలో కొలువైన ఎన్టీయే సర్కారుతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Haryanna Congress Loss: హరియాణా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ షాక్ కు గురైందా..? హరియాణా ఓటమితో కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా కలత చెందుతోందా..? హరియాణాలో తమదే విక్టరీ అనుకున్న కాంగ్రెస్ కు ఎక్కడ దెబ్బపడింది..?ఎన్నికల కౌంటింగ్ లో తొలి గంటలో దూసుకెళ్లిన కాంగ్రెస్ కు ఎక్కడ బ్రేక్ పడింది..? హరియాణాలో ఓటమిపై కాంగ్రెస్ కు ఉన్న అనుమానాలేంటి ..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.