Sujana Chowdary : సుజనా చౌదరి ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేని రాజకీయ నాయకుడు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా సుజనా చౌదరికి ముద్ర ఉంది. చంద్రబాబు అతి కొద్ది మంది అంతరంగికుల్లో సుజనా ఒకరు అని బాబు సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. అలాంటి సుజనా చౌదరి ఇప్పుడు ఎందుకో తెలియని అసంతృప్తిలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. కూటమిలో భాగంగా బీజేపీ తరుపున పోటీ చేసి సుజనా గెలుపొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించింది. బీజేపీ తరుపున మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో సుజనా సీనియర్ కావడంతో పాటు చంద్రబాబు, ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు కలిగి ఉండడంతొ తనకు మంత్రి పదవి దక్కుతుందని సుజనా భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ అలా జరగలేదు. బీజేపీ తరుపున ధర్మవరం నియోజకవర్గానికి చెందిని సత్యకుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది.
ఐతే ఎంతగానో మత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న చౌదరి గారికి మాత్రం నిరాశే మిగిలింది. మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్యే పదవితోనే సుజనా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే పదవితో సుజనా చౌదరి అంతగా సంతోషంగా లేనట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేగా కేవలం నియోజకవర్గానికి మాత్రం పరిమితం కావాల్సి వస్తుందని సుజనా తెగ బాధపడిపోతున్నారట. అంతక ముందు రెండు సార్లు ఎంపీగా చేసిన అనుభవం ఉన్న సుజనా చౌదరి ,ఎమ్మెల్యే పదవిలో అంతగా కన్ఫర్ట్ గా లేనట్లు తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్నప్పుడు తరుచుగా ప్రధానీ మోదీ, అమిత్ షా తో అనేక మంది కేంద్ర మంత్రులను కలిసిన సుజనా చౌదరి ఇప్పుడు మాత్రం ఒక సాదాసీదా ఎమ్మెల్యేగా ఉండడం అంతగా ఇష్టపడడం లేదని తెలుస్తుంది. కనీసం తనకు రాష్ట్రంలో మంత్రి పదవి ఐనా దక్కితే బాగుండేది అని అనచరుల వద్ద పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తుంది. దీని కన్నా ఎంపీగా ఉన్నా బాగుండేది కదా అని సుజనా తన అచరుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇటీవల జరుగుతున్న పలు కార్యక్రమాల్లో కూడా సుజనా అంతంతగానే పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి తప్పు చేశామన్న అని ఇప్పుడు పదే పదే అనుకుంటున్నట్లు అనచరులు చెబుతున్నారు. ఈ గల్లీ కన్నా ఆ ఢిల్లీయే బాగుంది అనే సుజనా భావన అని అనచరులు చెబుతున్నారు. మరోవైపు తనకు మంత్రి పదవి దక్కకపో్వడానికి కారణాలపై కూడా సుజనా ఆరా కూడా తీసారట. ఐతే అందులో ముఖ్యంగా చంద్రబాబు సన్నిహితుడిగా ముద్ర ఉండడంతోనే మంత్రి పదవి దక్కకపోవడానికి ఒక కారణంగా తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీలో మొదటి నుంచి ఉండి బీజేపీ సిద్దాంతాలను నమ్ముకున్న వాళ్లకు బీజేపీ అధిష్టానం మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని అందులో భాగంగా సత్యకుమార్ కు మంత్రి పదవి వచ్చిందని సుజనా భావిస్తున్నారట. ఐతే భవిష్యత్తులోనైనా ఏదైనా కీలక అవకాశం రాకపోతుందా అని సుజనా యోచిస్తున్నారట.
ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడంతో అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సుజనా బీజేపీలో చేరారు. ఒక రకంగా అప్పుడు సుజనాతో పాటు మరో ఎంపీ సీఎం రమేశ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ ఇద్దరికి కూడా చంద్రబాబు మనుషులే అనే ముద్ర ఉంది. దీంతో ఈ ఇద్దరు అప్పుడు చంద్రబాబు ప్రోత్సాహంతోనే బీజేపీ చేరారని ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.అప్పటి నుంచి ఆ ఇద్దరు బీజేపీలో కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవల మళ్లీ టీడీపీ ఆద్వర్యంలోని కూటమి ఏపీలో అధికారంలోకి రావడంతో సుజనా చౌదరి ఆలోచనలో మార్పు వచ్చిందంట. ఎలాగో తమ గురువు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండడంతో తనకు ఎలాగైనా మంత్రి పదవి వస్తుందని అనుకున్నారట. కానీ అలా జరగకపోవడంతో కొంత నిరాశలో సుజనా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కన్నా ఆ ఎంపీయే బాగుంది కదా అని అనుకుంటున్నారట.
ఇప్పటికైతే ఎమ్మెల్యేతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి సుజనాకు వచ్చింది. మరి భవిష్యత్తులో సుజనా అనుకుంటున్నట్లుగా ఏదైనా పెద్ద పదవి వస్తుందా ..? బీజేపీ అధిష్టానం సుజనాకు ఆ అవకాశం ఇస్తుందా లేకుంటే చంద్రబాబు సహకారంతో ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter