'కరోనా వైరస్'.. కరాళ నృత్యం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా అంతా లాక్ డౌన్ పరిస్థితి కనిపిస్తోంది. జనం అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా 144 సెక్షన్ విధించడం కూడా చూస్తున్నాం.
పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగు పులుముకున్న తర్వాత అధికారంలో ఉన్న బీజేపీ, మిగతా విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజూ వేలాది మంది నిరసనకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనిపై కొద్ది రోజుల క్రితమే.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెళ్లికి రోడ్డు బ్లాక్ చేస్తే ఊరుకుంటామా..? ఢిల్లీ షహీన్ భాగ్ లో రెండోసారి కాల్పులు జరిపి పట్టుబడ్డ వ్యక్తి ... పోలీసుల విచారణలో చెప్పిన సమాధానం ఇది. నిన్న షహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ చట్టం 2019కు వ్యతిరేకంగా కొంత మంది ఆందోళన చేస్తున్నారు. వారిపై అకస్మాత్తుగా ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు .
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది. పోలింగుకు ఇంకా నాలుగు రోజులే ఉండటంతో అన్నీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాలన్నీ ఉదృతం చేశాయి. ఇందులో భాగంగా శనివారం కామారెడ్డిలో మజ్లీస్ నేత ఎంపీ అసదుద్దిన్ ఓవైసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి అని అయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC)లపై వ్యతిరేక ప్రదర్శనలకు వేదికైంది. మ్యాచ్ జరుగుతుండగానే మధ్యలోనే లేచినిల్చున్న పలువురు ఆందోళనకారులు.. సిఎఎ, ఎన్ఆర్సిలపై వ్యతిరేక నినాదాలు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా (NRC)పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలువురు వాలంటీర్లు నడుంబిగించారు. దాదాపు 400 విద్యా సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్న తెలంగాణ ప్రైవేటు స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సైతం తమ విద్యా సంస్థల్లో ఈ తరహా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.
బీహార్‌లో జాతీయ పౌర పట్టిక (NRC)పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి తన వైఖరిని స్పష్టంచేశారు. ఎన్డిఏ భాగస్వామి అయిన నితీష్ కుమార్ ఎన్ఆర్సి, ఎన్పిఆర్, సిఎఎలపై వారి వైఖరి ఏంటో స్పష్టంచేయాలని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ చేసిన డిమాండ్‌కి స్పందిస్తూ సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం.. CAA-2019పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో పౌరసత్వ సవరణ చట్టం అసలు ఉద్దేశ్యమేంటి..? ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి..? అపోహలు.. నిజానిజాలేంటి..? ఇప్పుడు తెలుసుకుందాం.
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పశ్చిమ బెంగాల్, అసోం, దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై ప్రధాని ట్వీట్ చేశారు. దేశంలో హింసాత్మక ఘటనలకు తావు ఉండకూడదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.