JAGAN KTR MEET: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మీటింగ్ నిర్వహిస్తున్న ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సంబంధించి దావోస్ వేదికగా మరో ఆసక్తికర ఘటన జరిగింది. దానిపై ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది
CM Jagan Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి దావోస్ వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలతో చర్చించారు. దావోస్ వేదికగా ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆంధ్రాలో భారీ పెట్టుబడులు పెట్టేందులు పలు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి.
AP Govt: విశాఖ రుషి కొండ తవ్వకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఇదివరకే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
CM Jagan Tour: దావోస్‌లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా టూర్‌ను కొనసాగిస్తున్నారు. రెండురోజూ కూడా పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశమవుతారని సీఎంవో అధికారులు తెలిపారు.
CM Jagan Tour: నవ్యాంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్ దావోస్ పర్యటన కొనసాగుతోంది. పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ బృందం భేటీ అవుతోంది. రాష్ట్ర పరిస్థితులను వారికి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
Pawan Kalyan: పెట్రోల్,డీజిల్‌పై సుంకం పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఓవైపు హర్షం వ్యక్తమవుతుంటే..మరోవైపు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే ఎందుకు తగ్గించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Jc Prabhakar Reddy: ఏపీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. అధికార,విపక్షాలు నువ్వానేనా అన్నట్లు ప్రజల్లోకి వెళ్తున్నాయి. గడప గడపకు పాలన అంటూ వైసీపీ క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాదుడే బాదుడు అంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Buggana on Yanamala: సీఎం జగన్.. దావోస్ పర్యటనపై విపక్షాల విమర్శలకు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. కొందరూ కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు.
Yanamala on CM Jagan: ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఎందు కోసం టూర్ అని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ..సీఎం జగన్‌కు సూటిగా ప్రశ్నలు సంధించారు.
CM Jagan Davos:గతంలో చంద్రబాబు దావోస్ లో తెగ హడావుడి చేసేవారు. దావోస్ సదస్సుకు ప్రతి ఏటా హాజరయ్యేవారు చంద్రబాబు. కీలక సమావేశాల్లో పాల్గొనేవారు. దావోస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేవారు.తొలిసారి జగన్ వెళ్లడంతో.. గతంలో చంద్రబాబు పర్యటనతో పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి
Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతంపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. తాజాగా సోనియా గాంధీతో ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు.
MLC Anantha Babu Car: ఏపీలో సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈకేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Lokesh Comments: ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశం రాజకీయ రచ్చకు దారి తీసింది. దీనిపై అధికార, విపక్ష పార్టీ నేతలు మాటల యుద్దానికి దిగారు. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడుగా వెళుతున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.వైసీపీని ఓడించేందుకు పొత్తులకు కూడా సిద్ధమని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలపైనా క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు పెంచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణలోనూ పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల చనిపోయిన జన సైనికుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
Somuveer Raju Letter: ఆంధ్రప్రదేశ్‌లో వరి అంశం మంటలు పుట్టిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలు దోపిడీని అరికట్టాలని లేఖలో తెలిపారు.
Chandra Babu Comments: రాయలసీమ జిల్లాల్లో పాగా వేయాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఈక్రమంలో జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. జగన్ ఇలాకాలో సమర శంఖం పూరించిన ఆయన..ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు. టూర్లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
KA Paul Comments: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ వ్యక్తులకు రాజ్యసభ సీట్లు ఇవ్వడంపై ఏపీలో ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. కేసీఆర్ ముగ్గురు పారిశ్రామిక వేత్తలనే పెద్దల సభకు పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ACB Mobile APP: ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అధికారులు పని చేయడం లేదా? లంచం ఇస్తేనే కాని ఫైల్ కదలదని చెబుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీకు అవినీతి బాధల నుంచి ఉపశమనం కలగబోతోంది. లంచగొండుల భరతం పట్టేలా, అవినీతి పీడకు చెక్ పెట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.