Jc Prabhakar Reddy: ఏపీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. అధికార,విపక్షాలు నువ్వానేనా అన్నట్లు ప్రజల్లోకి వెళ్తున్నాయి. గడప గడపకు పాలన అంటూ వైసీపీ క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాదుడే బాదుడు అంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలోనే ప్రజల్లోకి పాలన తీసుకెళ్లేందుకు మంత్రులు బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఈక్రమంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. జగన్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయిందని..దీనిపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి స్పందన కరవు అయ్యిందన్నారు. మంత్రుల బస్సు యాత్రకు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. లేకపోతే ప్రజాగ్రహనికి గురై దెబ్బలు తింటారని ఫైర్అయ్యారు.
రాయదుర్గంలోని ఆలయానికి తమ పార్టీ నేత కాల్వ శ్రీనివాసులు ఎందుకు అనుమతించడం లేదన్నారు. రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతుందనడానికి ఇదే నిదర్శమని విమర్శించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కాల్వ శ్రీనివాసులతో కలిసి రాయదుర్గంలోని ఆలయానికి వెళ్తానని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రజాప్రతినిధులు..కార్యకర్తలను సైతం గాలికొదిలేశారని ఆక్షేపించారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో వాలంటీర్లు తప్ప ఎవరూ పాల్గొనడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లు అయిన సందర్భంగా మంత్రులు బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి ఈయాత్ర ప్రారంభంకానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్రలు ప్రారంభంకానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also read:Weight Loss Diet: బరువు తగ్గేందుకు ఏ డైట్ మంచిది, దృష్టి పెట్టాల్సిన ఆహార పదార్ధాలు
Also read:Minister Harish Rao: పెంచింది బారన, తగ్గించింది చారణ..పెట్రోల్ ధరలపై మంత్రి హరీష్‌రావు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook