ACB Mobile APP: ఒక్క బటన్ నొక్కితే చాలు అవినీతి అధికారి అవుట్.. ఏపీ సర్కార్ కొత్త మొబైల్ యాప్

ACB Mobile APP: ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అధికారులు పని చేయడం లేదా? లంచం ఇస్తేనే కాని ఫైల్ కదలదని చెబుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీకు అవినీతి బాధల నుంచి ఉపశమనం కలగబోతోంది. లంచగొండుల భరతం పట్టేలా, అవినీతి పీడకు చెక్ పెట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 11:01 AM IST
  • ఏపీ ఏసీబీ కొత్త మొబైల్ యాప్
  • ఒక్క కాల్ చేస్తే చాలు అవినీతి అవుట్
  • మొబైల్ యాప్ లైవ్ రిపోర్ట్ ఫీచర్
ACB Mobile APP: ఒక్క బటన్ నొక్కితే చాలు అవినీతి అధికారి అవుట్.. ఏపీ సర్కార్ కొత్త మొబైల్ యాప్

ACB Mobile APP: ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అధికారులు పని చేయడం లేదా? లంచం ఇస్తేనే కాని ఫైల్ కదలదని చెబుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీకు అవినీతి బాధల నుంచి ఉపశమనం కలగబోతోంది. లంచగొండుల భరతం పట్టేలా, అవినీతి పీడకు చెక్ పెట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి అంతానికి జనాల చేతికే అస్త్రం అందిస్తోంది జగన్ సర్కార్. అవినీతి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించింది. ఒక్క కాల్ చేస్తే చాలు అవినీతి అధికారి అవుట్ అయ్యేలా కొత్త మొబెల్ యాప్ సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సిబ్బందితో పాటు ఇతరుల అవినీతిపైనా ఏసీబీ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

పారదర్శన పాలనే లక్ష్యమంటున్న ఏపీ సీఎం జగన్.. అవినీతి నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల పోలీస్ శాఖపై నిర్వహించి సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అవినీతి నిరోధక శాఖ కొత్త యాప్ కు రూపకల్పన చేసింది. మహిళల రక్షణ తీసుకొచ్చిన దిశ యాప్ మంచి ఫలితాలు ఇస్తుందని పోలీసులు చెబుతున్నారు. దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వెంటనే స్పందిస్తున్నారు పోలీసులు. దిశ యాప్ తరహాలోనే కొత్త మొబైల్ యాప్ ను ఏసీబీ రూపొందించింది. అత్యాధునిక టెక్నాలజీని ఇందులో అందుబాటులో ఉంచింది. ఏసీబీ మొబైల్ యాప్ ను త్వరలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏపీ ఏసీబీ ప్రస్తుతం 14400 టోప్ ఫ్రీ నెంబర్ ను ఉపయోగిస్తోంది. అయితే ఆ నెంబర్ ద్వారా ఫిర్యాదు మాత్రమే చేసే అవకాశం ఉంది. సాక్ష్యాలు, ఆధారాలు చూపించడానికి వీలులేదు. దీంతో ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవడం అధికారులకు కష్టమవుతోంది. ఫిర్యాదు రాగానే ఏసీబీ అధికారులు అక్కడికి వెళ్లి సోదాలు చేసి అవినీతి అధికారులను పట్టుకుంటున్నారు. ఇది సమయంతో కూడుకోవడంతో పాటు కొన్ని సార్లు నిందితులు దొరకకుండా తప్పించుకుంటున్నారు. కొందరు అధికారులు నేరుగా డబ్బులు తీసుకోకుండా తమ ఏజెంట్లు, మనుషుల ద్వారా అక్రమ దందా సాగిస్తున్నారు. ఏసీబీకి చిక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇలాంటి అవకాశం లేకుండా కొత్త మొబైల్ యాప్ రూపొందించింది ఏపీ ఏసీబీ. అవినీతిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేలా 14400 యాప్ ను తయారు చేసింది.

ఏసీబీ 14400 యాప్ లో లైవ్ రిపోర్ట్ ఆఫ్షన్ ఉంటుంది. ఎవరైనా లంచం అడుగుతున్నా.. తీసుకుంటున్నా.. ఇతరత్రా మార్గాలా ద్వారా అవినీతికి పాల్పడుతున్నా.. యాప్ ద్వారా నేరుగా లైవ్ రిపోర్ట్ ఫీచర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫొటో,వీడియో, ఆడియో, ఫిర్యాదు నమోదు ఆప్షన్లు యాప్ లో ఉన్నాయి. లంచం అడుగుతున్నప్పుడు మాటలను లైవ్‌లో రికార్డ్‌ చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు. లైవ్‌ వీడియో కూడా రికార్డు చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు. తర్వాత  లాడ్జ్‌ కంప్లైంట్‌ ఆప్షన్‌లోకి వెళ్లి సబ్‌మిట్‌ బటన్ నొక్కితే  ఏసీబీకి ఫిర్యాదు వెళుతుంది. దీనిైప ఏసీబీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు.

READ ALSO:YSR Sanchara Pashu Arogya Seva: మూగ జీవాలకు అత్యాధునిక వైద్యం.. పశు అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్

READ ALSO: Rajyasabha Elections: జగన్ కోటాలో బండికి రాజ్యసభ సీటు! కేసీఆర్ స్కెచ్ మాములుగా లేదుగా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

Trending News