Digital Payment Without Internet: ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి విధివిధానాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. ఒక లావాదేవీకి రూ.200 మించకుండా, లావాదేవీల మొత్తం కలిపి రూ.2,000 వరకు ఈ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించింది.
Digital payment: దేశంలో డిజిటల్ పేమెంట్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో సాధించిన వృద్ధిని మించి.. గడిచిన 12 నెలల్లో పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
SBI Extra Transaction Charges: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై సేవింగ్స్ అకౌంట్ నుంచి జరిగే యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ పై ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయమని స్పష్టం చేసింది.
మీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేసే క్రమంలో కార్డు వెనకాలే ఉన్న సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సి రావడం చూసే ఉంటారు. ఇంతకీ ఈ సీవీవీ నెంబర్ అంటే ఏంటి ? డిజిటల్ పేమెంట్స్‌లో సివివి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దేశంలో డిజిటల్ చెల్లింపుల భారీగా పెరిగాయనడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేసిన ఓ వీడియో అద్దం పడుతోంది. ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్నట్లు అందులో ఉంది.
Digital Payments: కరోనా సంక్షోభం కారణం కావచ్చు..మరో ఇతర కారణం కావచ్చు. డిజిటల్ చెల్లింపులు గత కొద్దికాలంగా విపరీతంగా పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం డిజిటల్ లావాదేవీలు పెరగడంతో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరుగుతున్నాయి. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద డిజిటల్ పేమెంట్స్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా పేరున్న పేటీఎం తన వ్యాపారాన్ని మరింత భారీ స్థాయిలో విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి (Paytm to go for IPO) తెరతీసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.21,800 కోట్లు నిధులు సమకూర్చుకోవాలని పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది.
Gas Cylinder price: గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయిందని ఆందోళన చెందుతున్నారా..గూగుల్ పే మీకు శుభవార్త అందిస్తోంది. గూగుల్ పే ద్వారా సిలిండర్ బుక్ చేసుకోండి..భారీ డిస్కౌంట్ పొందండి.
ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ వ్యాపారానికి సంబంధించి లావాదేవీలను పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మరింత సురక్షితంగా చేయడానికి OTPతో పాటు ఫేషియల్ ఐరిస్ ను పాస్‌వర్డ్‌గా ఉపయోగించనున్నట్టు పేర్కొంది.
డిజిటల్ చెల్లింపులని ప్రోత్సహించి డిజిటల్ ఇండియాకు మరింత ఊతమిచ్చే ప్రయత్నంలో భాగంగా ఇకపై రూ.2,000 వరకు డెబిట్ కార్డు ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ని రద్దు చేస్తున్నట్టు తాజాగా కేంద్రం స్పష్టంచేసింది.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ చర్యలో భాగంగా డిజిటల్ లావాదేవీలపై జీఎన్టీ పన్ను తగ్గించే అంశంపై కసరత్తు చేస్తోంది. రూ.2 వేల కంటే అధికమొత్తంలో కొనుగోలు చేసిన వారికి 2 శాతం పన్ను మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనలను ఆర్ధికశాఖ సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. అయితే నేరుగా డిస్కౌంట్ ప్రకటించాలా లేదా క్యాష్ బ్యాక్ రూపంలో ఇవ్వాలా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజా ప్రతిపాదనపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆర్బీఐ, ఐటీ శాఖలను ఆర్ధికశాఖ కోరినట్లు సమాచారం. ఆయా శాఖల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.