ఒక వైపు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీ ఇస్తూ.. ఒక రకంగా చెప్పాలంటే విజయం వైపు దూసుకుపోతున్న బీజేపీ.. అమ్రేలీ, నర్మద, పోరుబందర్, ఆనంద్, డాంగ్స్, తాపి జిల్లాల్లో పెద్దగా రాణించకపోవడం వెనుక కారణమేమై ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.
గుజరాత్‌కు చెందిన యువ న్యాయవాది మరియు సామాజికవేత్త జిగ్నేష్ మెవానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి చక్రవర్తి విజయ్ కుమార్ పై 21000 ఓట్ల తేడాతో గెలుపొందారు.
గుజరాత్లో బీజేపీ వరుసగా ఆరోసారి అధికారం చేపట్టాలని యోచిస్తుండగా, రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ప్రతిపక్ష పాత్రకు స్వస్తిపలికి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కాంగ్రెస్ భావిస్తోంది
గుజరాత్ ఎన్నికల్లో ప్రస్తుత సమాచారం ప్రకారం బీజేపీ ఓట్లలెక్కింపులో 87 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం విషయం. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనే భావించవచ్చు. ఏదైనా మ్యాజిక్ జరిగే అవకాశం ఉందా.. అన్నది తెలుసుకోవాలంటే పూర్తి ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
అయితే హిమాచల్‌లో ఇంకా బీజేపీయే ముందంజలో ఉంది
గుజరాత్ ఎన్నికల ప్రచారంపై నీళ్లు చల్లారు అహ్మదాబాద్ పోలీసులు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ రోడ్ షో లకు అనుమతి లేదని చెప్పారు. గుజరాత్ లో రెండో దశ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ తరుఫున ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.. !
గుజరాత్ తొలిదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై విరుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్యలోని రామ మందిరాన్ని 2019 ఎన్నికలతో ముడిపెట్టాలని భావిస్తోందని అన్నారు.
గుజరాత్ శాసనసభ ఎన్నికల రెండవ దశ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాత్రి 76 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందే రెండు దఫాలుగా 86 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.