హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలలో ఓడిపోయిన తరువాత రాహుల్ గాంధీ మరుసటిరోజు మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- "ఈ ఎన్నికలతో స్పష్టమైపోయింది ప్రధాని నరేంద్ర మోదీ విశ్వసనీయత ఏంటో? గుజరాత్ ప్రజలు బీజేపీకి ఒక సందేశం ఇచ్చారు. బిజెపి కోపాన్ని ప్రేమ ఓడిస్తుంది " అన్నారు . "మేము ఎన్నికల్లో ఓడిపోయాం.. కానీ మంచి ఫలితమే వచ్చింది" అన్నారు.
Hamare liye kaafi acha result hai, theek hai haar gaye, jeet sakte the, wahan thodi kami hogai: Congress President, Rahul Gandhi on Gujarat elections #GujaratVerdict pic.twitter.com/UxEE37Szuo
— ANI (@ANI) December 19, 2017
మూడు, నాలుగు నెలల కిందట మేము గుజరాత్ ప్రచారానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ బీజేపీని ఓడించలేదు అన్నారు. కానీ మేము ఆ మూడు, నాలుగు నెలలు చాలా కష్టపడ్డాం. బీజేపీ దెబ్బతిన్న ఫలితాలను ఒకసారి మీరు గమనిస్తే తెలిసిపోతుంది.
గుజరాత్ ప్రజలు బీజేపీ నమూనాను పరిగణించలేదు. ఈ నమూనా యొక్క మార్కెటింగ్ మరియు ప్రమోషన్ చాలా బాగానే ఉంది. కానీ అది బయట మాత్రమే. లోపల అంతా ఖాళీ. వారు మా ప్రచారానికి సమాధానం చెప్పలేదు. పీఎం మోదీ ఎన్నికల ప్రచారంలో నోట్ల రద్దు, జీఎస్టీ ఊసే ఎత్తలేదు. ఫలితాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "మాకు చాలా మంచి ఫలితాలు దక్కాయి. మేము ఓడిపోయాం. కానీ మేము గెలిచే వాళ్లం" అని అన్నారు.