అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల ప్రచారంపై నీళ్లు చల్లారు అహ్మదాబాద్ పోలీసులు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ రోడ్ షో లకు అనుమతి లేదని చెప్పారు. గుజరాత్ లో రెండో దశ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ తరుఫున ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.. !
Request by BJP & Congress for conducting PM Modi & Rahul Gandhi's road show tomorrow, turned down by Police due to security, law & order reasons & to avoid public inconvenience : Anup Kumar Singh, Police Commissioner #Ahmedabad to ANI #GujaratElection2017 pic.twitter.com/qaNr7lbdYL
— ANI (@ANI) December 11, 2017
"అహ్మదాబాద్లో డిసెంబర్ 12వ తేదీ మంగళవారం నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ రోడ్ షో లు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ రోడ్ షోల అనుమతులను మేము నిరాకరించాం. శాంతిభద్రతలు, ప్రజల అసౌకర్యం దృష్ట్యా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం' అని పోలీసులు తెలిపారు. డిసెంబర్ లో తొలిదశ ఎన్నికలు డిసెంబర్ 8 శనివారంనాడు జరిగాయి. రెండో దఫా ఎన్నికలు డిసెంబర్ 14న జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 19న వెల్లడిస్తారు.