Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్‌బై చెప్పారు. ఏ పార్టీలో చేరేది త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు.
Komatireddy Rajagopal Reddy Pressmeet: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. ఏ వ్యాపారం చేయకున్నా... రేవంత్ రెడ్డికి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
Revanth Reddy About Rajagopal Reddy: తెలంగాణ కోసం పోరాటాలు చేశామని చెప్పుకుంటున్న కొంతమంది ముసుగువీరులు తెలంగాణనే కించపరిచిన వారి చెంతన చేరుతున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ వేడి హీట్ పుట్టిస్తోంది. మునుగోడు చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Munugodu Byelections News Updates : రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబంపై యుద్ధం ప్రకటిస్తా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను ప్రకటించబోయే యుద్ధం రాజకీయ పార్టీల మధ్య యుద్ధం కాదని.. కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే చివరి యుద్ధం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Komatireddy: తెలంగాణ కాంగ్రెస్ తో పాటు రాష్ట్రంలో కాక రేపుతున్న సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని ఆ పార్టీ అధ్యక్షుడు చెబుతుండగా... రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని సీఎల్పీ నేత తెలిపారు. దీంతో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా సీన్ మారిపోయింది.
Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీ ప్రతిష్ట మసకరబారేలా చేస్తోన్న నేపథ్యంలో ఆయనకి నచ్చజెప్పేందుకు పార్టీ అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపింది. రాజగోపాల్ రెడ్డితో చర్చలకు ఏఐసీసీ దూతగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు.
Komatireddy Rajagopal Reddy into BJP: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఎప్పుడు చేరుతారనే దానిపై ఆసక్తికర ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
Komatireddy Rajagopal Reddy Comments on Revanth Reddy: జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయాలా అంటూ టీపీసీసీ చీఫ్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Telangana politics: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మునుగోడు వైపు మళ్లాయి. ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలు గుప్పుమంటున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేస్తారని గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి.
Jagga Reddy comments on Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం పుట్టింది. ఇక్కడ హైదరాబాద్‌లో జగ్గా రెడ్డి మీడియా ముందుకొచ్చారు. అటు ఢిల్లీలో రేవంత్ రెడ్డి సహా సీనియర్లు హైకమాండ్‌ను కలిశారు. దీంతో, మరోసారి టీ-కాంగ్రెస్ పంచాయతీ హాట్‌టాపిక్‌గా మారింది. తనకు కాంగ్రెస్ పార్టీతో అసలు పంచాయితీయే లేదని, గొడవంతా రేవంత్ రెడ్డితోనే అని ఆ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి స్పష్టం చేశారు.
Komatireddy Rajagopal Reddy on Party Change: రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధపడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనే పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరిగింది.
Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై కాంగ్రెస్ మండిపడింది. శాసనసభ పూర్తి అప్రజాస్వామికంగా..నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.
Congress MLA Komati Reddy Rajgopal Reddy : సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోవడంతో పార్టీ మారే ఉద్దేశం ఉందా అనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పార్టీ మారడం అంశంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
జీరో అవర్‌లో ( Zero hour ) మైకు ఇస్తే హీరోగిరీ చూపిస్తామంటే కుదరదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ ( Minister KTR vs MLA Komatireddy Rajagopal Reddy ) కౌంటర్ ఇచ్చారు. కొత్త మున్సిపాలిటీలకు బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.