Revanth Reddy: తెలంగాణ రాజకీయ భవిష్యత్ పరిణామాలకు కేంద్రంగా మారబోతోంది మునుగోడు ఉప ఎన్నిక. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప సమరం.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి పెద్ద తలనొప్పిగా మారింది.
Munugode Byelection Updates: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, పోటాపోటీ వ్యూహాలతో మునుగోడులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది
Munugode Byelection: తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన నల్గొండ జిల్లా మునుగోడులో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల పోటాపోటీ వ్యూహాలతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.
Rajagopal Reddy: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. అసెంబ్లీలో స్పీకర్ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. తెలంగాణ కేసీఆర్ కుటుంబంచేతిలో బందీఅయ్యిందని..
Addanki Dayakar about komatireddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నిక కోసం సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ చండూరులో చేపట్టిన బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తర్వాత మళ్లీ అంత హైలైట్ అయిన పేరుగా అద్దంకి దయాకర్ వార్తల్లోకెక్కారు.
Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమయ్యింది.
తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడుపై ఫోకస్ పెంచాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఒకవేళ సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఉపఎన్నిక ఉండదు. ఈ నేపథ్యంలో ఉపఎన్నికపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది.
Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయం ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలో కీలక నేతలయిన కోమటిరెడ్డి బ్రదర్స్ కమలం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈమేరకు ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది.
Rajagopal Reddy: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. కాంగ్రెస్, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడుగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ విమర్శలు, ఆరోపణలను డీకే అరుణ ఖండించారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేసింది చంద్రబాబేనని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారని పేర్కొన్నారు. బీజేపీని విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి విమర్శించారు.
Munugode By Election: తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చంతా మునుగోడు పైనే. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ గెలుస్తాడా.. కాంగ్రెస్ తన కంచుకోటను నిలుపుకుంటుందా.. లేక ఈసారి టీఆర్ఎస్ పాగా వేస్తుందా.. ఇలా మునుగోడు చుట్టూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
Komatireddy Rajagopal Reddy News: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ ఇద్దరికి కోమటిరెడ్డి బ్రదర్స్ అనే పేరున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ విషయంలోనైనా అన్నాదమ్ముళ్లిద్దరూ కలిసే అడుగేస్తారని ఆ ఇద్దరి గురించి తెలిసిన వాళ్ల మాట.
Komatireddy Rajagopal Reddy Exclusive Interview: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా - మునుగోడు ఉప ఎన్నిక.. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాల గురించి ఎవరి నోట విన్నా వినిపిస్తున్న ఏకైక హాట్ టాపిక్ ఇది. ఇంకా చెప్పాలంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత మరోసారి రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించిన అంశం కూడా ఇదే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.