Congress Leaders Objected Kadiyam Kavya: వరంగల్ పార్లమెంట్ స్థానంలో కడియం కావ్యకు పరిస్థితులు సహకరించడం లేదు. ఆమె రాకను కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకిస్తుండగా.. తాజాగా ఆమె ఎదురుగానే కార్యకర్తలు కొట్టుకున్నారు.
Revanth Reddy Reply To Delhi Police On Fake Video Row: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బిజీగా ఉన్నానని స్పష్టం చేశారు.
Narendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏఐఎంఐఎం పార్టీ లోక్‌సభ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రను తిప్పికొట్టారు. పొరపాటున మాధవీలత గెలిస్తే హైదరాబాద్ సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ఓట్లతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
Glass Symbol: రిజర్వేషన్ల రద్దు అంశంపై ఫేక్ వీడియో వివాదం రేవంత్ రెడ్డిని ప్రమాదంలోకి నెట్టింది. అమిత్ షా మాట్లాడినట్లు ఉన్న ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ వివాదం రేవంత్ రెడ్డి చుట్టూ ముట్టడంతో తీవ్ర కలకలం ఏర్పడింది.
Amit Shah Escaped Major Accident In Begusarai Poll Meeting: ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది.
Gutha Amit Reddy Joins In Congress Party: బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నల్లగొండ లోక్‌సభ స్థానం టికెట్ ఆశించి భంగపడడంతో మాజీ సీఎం కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్న గుత్తా కుటుంబం ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనుంది.
Gutha Amit Reddy Joins In Congress Party: అందరూ ఊహించినట్టే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. త్వరలోనే సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనుండడంతో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.
TSSPDCL Suspends Keesara DE Over Malla Reddy Poll Meeting Power Cut: విద్యుత్ కోతలు తెలంగాణలో తీవ్ర రాజకీయం దుమారం రేపుతుండగా.. మల్లారెడ్డి మీటింగ్‌లో ఎదురైన సంఘటన కారణంగా ఓ ఉద్యోగి ఉద్యోగం ఊడిపోయింది.
YS Jagan Convoy Hits Dog In Gannavaram: ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న క్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకోవడంతో సీఎం జగన్ చలించిపోయారు. కుక్కకు దగ్గరుండి వైద్యం అందించాలని ఆదేశించారు.
Asaduddin Owaisi Strong Counter To Narendra Modi On Muslim Population: సంతానోత్పత్తిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ముస్లింలే అత్యధికంగా కండోమ్‌లు వాడుతున్నారని తెలిపారు.
KT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
Arvinder Singh Lovely Resign Delhi Congress: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నాయకుడు రాజీనామా చేయడంతో కలకలం రేపింది.
Second Phase Lok Sabha Elections Completed Peaceful: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్, కేరళ, జమ్మూకశ్మీర్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కీలకమైన స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. వేసవి ఎండల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. సినీ తారలు, పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Summer Heat Effect Voters Died After Casting Vote: ఓటు ప్రాణాలు తీస్తోంది. ఓటు వేసేందుకు వెళ్లిన వారిపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు తాళలేక వృద్ధులు కుప్పకూలిపోతున్నారు. ఇలా ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందడం విషాదం నింపింది.
YSRCP Manifesto: మరోసారి అధికారం సొంతం చేసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ భారీ వ్యూహంతో సిద్ధమయ్యారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షన పథకాలను సీఎం జగన్ ప్రకటిస్తారని సమాచారం. మహిళలు, రైతులు, యువతకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Harish Rao Challenge: తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో హరీశ్ రావు తన రాజీనామాతో గన్‌పార్క్ వద్దకు రాగా.. రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించలేకపోయారు. రుణమాఫీ ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ అమలు చేయకుంటే తన రాజీనామాను ఆమోదించుకోవాలని హరీశ్ రావు సంచలన సవాల్ విసిరారు. కానీ రేవంత్ రెడ్డి నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.
Nominations Finished In Telangana And Andhra Pradesh For Elections: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పూర్తయ్యాయి. ఆఖరి రోజున అభ్యర్థులు నామినేషన్లు పూర్తి చేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.