Munugode Bypoll: మాజీ ఎంపీ బూర నర్సయ్య ఇవాళ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరనున్నారు. బూర నర్సయ్య బీజేపీ జాతీయ ప్రధాన కార్యలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. చండూరు మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీజేపీ కావాలనే కుట్రతో కారును పోలిన గుర్తులను కేటాయించిందని ఆరోపించారు.
KCR Munugode Campaign:తెలంగాణ సీఎంవో అధికారులు మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన, బసకు సంబంధించిన ఏర్పాట్ల కోసమే సీఎంవో అధికారులు మునుగోడులో తిరుగుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ బస కోసం మునుగోడు, చండూరు, చౌటుప్పల్ లో భవనాలను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు
Munugode Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎవరి ప్రచారం వాళ్లు చేసుకోవాలని కాని ఇలా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇదంతా కావాలనే పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని హైకోర్టులో అధికార పార్టీ పిటిషన్ వేసింది. ఎన్నికల కమిషన్ సింబల్స్ జాబితాలో కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులు ఉన్నాయి. అయితే కారును పోలి ఉన్న ఈ గుర్తులతో తమకు నష్టం జరుగుతుందని టీఆర్ఎస్ భయపడుతోంది. గుర్తుల జాబితా నుంచి ఈ ఎనిమిది సింబల్స్ ను తొలగించాలని ఈనెల 10న ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది.
Komatireddy Venkat Reddy: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాంధీభవన్ కు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని మరోసారి స్పష్టం చేశారు. తాను హోంగార్డు లాంటి వాడినన్న కోమటిరెడ్డి.. మునుగోడు ప్రచారానికి ఎస్పీ రేంజ్ లాంటి వాళ్లే వెళతారని అన్నారు.
Munugode ByPoll:గతంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. తాజాగా మాత్రం ఆయనకు మద్దతుగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.సంస్థాన్ నారాయణపురంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా పోస్టర్లు వేశారు
Munugode Bypoll: కొన్ని నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా.. స్వతంత్ర అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ప్రధాన పార్టీల సింబల్ పోలిన గుర్తు రావడం వలనే వారికి భారీగా ఓట్లు వచ్చాయన్న వాదన ఉంది.
Munugode Bypoll:మునుగోడు ఉపఎన్నికలో చౌటుప్పల్ మండలం ఆరెగూడం టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్నారు మల్లారెడ్డి. గత వారం రోజులుగా అక్కడే ప్రచారం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం గౌడ సామాజికవర్గం ఓటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణానికి 12 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా.. ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. పోటాపోటీ ర్యాలీలతో గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు స్పష్టిస్తున్నారు.
Harish Rao On Munugode: మునుగోడు ఉపఎన్నికపై సంచలన ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. మునుగోడులో గెలిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. పోరాటాల గడ్డ నల్గొండ ప్రజలను బీజేపీ మోసం చేయలేదన్నారు.
బీజేపీవన్ని జుమ్లా మాటలు అన్నారు హరీష్ రావు
Munugode Bypoll: మునుగోడులో ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. పోటాపోటీ ర్యాలీలతో గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు స్పష్టిస్తున్నారు.
Munugode Bypoll: ప్రచారమే నిజమైంది. టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ కు తన రాజీనామా లేఖ పంపించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బూర.. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, భువనగిరి ఎంపీగా పని చేసిన అనుభవాలను లేఖలో పంచుకున్నారు. అయితే టీఆర్ఎస్ లో రాజకీయ బానిసత్వం చేస్తూ తాను ఇక పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కారు దిగి కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఢిల్లీలోనే ఉన్న బూర.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.
Munugode Bypoll: మునుగోడులో గంటగంటకు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఒక పార్టీ మరో పార్టీకి షాకిస్తే.. వెంటనే మరో పార్టీ మరో షాక్ ఇస్తోంది.బూర టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే పల్లె రవికుమార్ గౌడ్ కారు పార్టీలో చేరిపోయారు
Boora Narsaiah Goud: 2014లో భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సంచలన విజయం సాధించిన బూర.. 2019లో మాత్రం వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే బూర భువనగిరి ఎంపీగా పోటి చేసినా.. ఆయన సొంతూరు మాత్రం సూర్యాపేట నియోజకవర్గంలో ఉంది.
Munugode Bypoll: బూర నర్సయ్య గౌడ్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ బీసీ నేతలు కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.ఇప్పటికే తన అనుచరులతో బూర మంతనాలు సాగించారని అంటున్నారు. కొందరు బీసీ నేతలు బూరకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లారని కూడా తెలుస్తోంది.
Munugode Bypoll: మునుగోడు ఉపసమరానికి సంబంధించి మరో ట్విస్ట్ జరిగింది. ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ప్రజా గాయకుడు గద్దర్.. చివరి నిమిషంలో హ్యాండిచ్చారు. ప్రజా శాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేస్తారని గతంలో కేఏ పాల్ ప్రకటించారు. కాని ప్రజాశాంతి పార్టీ తరఫున తానే నామినేషన్ దాఖలు చేశారు కేఏ పాల్.
Munugode Bypoll: తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేశారు. గ్రామాల వారీగా ఇంచార్జులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.