బీజేపీ నేతలను ప్రలోభాలకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రవు ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన జోరుగా పాల్గొంటున్నారు. హుజురాబాద్ ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణలో ఏ ఇద్దరు కలిసినా మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చే జరుగుతోంది.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. హామీలు, ప్రలోభాలు, భరోసాలే కాదు, నమ్మకం కలిగేలా ఓటు కోసం ఒట్లు కూడా వేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు..
TRS VS BJP:టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కమలం పార్టీని పరేషాన్ చేస్తోంది. దీంతో కారు పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నాల్లో బీజేపీ నేతలు ఉన్నారని సమాచారం. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి వాళ్లతో బీజేపీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. త్వరలోనే కొందరు కీలక నేతలకు కాషాయ కండువా కప్పడం ఖాయమంటున్నారు
Komatireddy Venkat Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఆయన ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఆడియో లీకై వైరల్ గా మారింది. పార్టీలకు అతీతంతా రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు. కోమటిరెడ్డి ఆడియో కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం రేపుతోంది.
Komatireddy Venkat Reddy:బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తన సోదురుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ చేయలాంటూ కాంగ్రెస్ నేతలకు ఎంపీ వెంకట్ రెడ్డి చేసిన ఫోన్ కాల్ లీకై వైరల్ గా మారింది.ఆ ఘటన మరవకముందే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన మరో వీడియో బయటికి వచ్చింది
Munugode Bypoll: మల్కాపూర్ ఓటర్ల ప్రసన్నం కోసం కొత్త ఎత్తు వేశారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ౩ వందల మంది ఓటర్లను యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి దర్శనానికి తీసుకెళ్లారు. 12 ఆర్టీసీ బస్సుల్లో ఓటర్లను నేరుగా కొండపైకి తీసుకెళ్లారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. స్వామి వారి సేవలను నిలిపివేసి మరీ మునుగోడు ఓటర్లకు దర్శనం కల్పించారు.
మునుగోడు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అన్ని పార్టీలు గెలుపు కోసం శాయశక్తుల శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ తరుపున మునుగోడు ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. పూర్తి సమాచారం కోసం వీడియోను చూడండి.
Munugode Bypoll: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది. కొంత మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అంటున్నారు. తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న భయంతో వాళ్లకు నిద్ర రావడం లేదట.
Munugode Bypoll: Munugode Voters gets Diwali 2022 Gifts. మునుగోడు ఓటర్లకు 'దీపావళి' ఆఫర్లు ప్రధాన పార్టీలు అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది.
Revanth Reddy: సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఆయన పీసీసీ పదవి పోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకే హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగింది. కాని అది టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో కాంగ్రెస్ కు పెద్దగా నష్టం లేకపోయింది
Munugode Bypoll: చౌటుప్పల్ మండలం దండు మల్కాపుర్ గ్రామానికి టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్నారు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తన గ్రామంలో పార్టీ అభ్యర్థికి లీడ్ తెచ్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే మల్కాపూర్ ఓటర్లను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి తీసుకెళ్లారు
Munugode CRPF: మునుగోడు ఉప ఎన్నికల దగ్గర పడుతున్న వేళ డబ్బు , మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. పతంగి టోల్ ప్లాజా సహా కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మొత్తం 28 చెక్ పోస్టు లు ఏర్పాటు చేశారు. మంత్రులు, mla ల వాహనాలను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Munugode Bypoll Symbol: గుర్తుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి గతంలోనే ఫిర్యాదు చేసింది. కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను ఎవరికి కేటాయించవద్దని కోరింది. టీఆర్ఎస్ అభ్యంతరం చెప్పిన గుర్తులతో రోడ్డు రోలర్ కూడా ఉంది. గతంలో రోడ్డు రోలర్ గుర్తుతో తమకు చాలా ఇబ్బంది జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. దీంతో కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్ గుర్తును ఎవరికి కేటాయించవద్దని టీఆర్ఎస్ ఒత్తిడి చేయడం వలనే తనకు కేటాయించలేదని శివకుమార్ ఆరోపించారు.
Munugode Bypoll: ఉపఎన్నికల వేళ మునుగోడును భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేశాయి. డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. టోల్‌ప్లాజాలు, చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని ఆపి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా మోహరించిన కేంద్ర, రాష్ట్ర బలగాలు.. కీలకమైన పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. రాజకీయంగా ఉపఎన్నిక కీలకంగా మారటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు.
Munugode Bypoll: అభ్యర్థుల గుర్తుల కేటాయింపు వివాదంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. రిటర్నింగ్ ఆఫీసర్ పై వేటు వేసింది. ఉప ఎన్నికకు కొత్త రిటర్నింగ్ అధికారి కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు, సీఈసీకి మూడు పేర్లతో ప్రతిపాదనలు పంపించారు
Munugode Bypoll Symbol:వకుమార్ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మునుగోడు ఎన్నికల అధికారికి ఉత్తర్వులు జారీ చేసింది. యుగ తులసి పార్టీ అధ్యక్షుడు కే శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని ఆదేశించింది
JP Nadda: 2016లో మర్రిగూడలో పర్యటించారు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా. చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం అదే ఏడాది చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గాన్ని మొత్తం 86 క్లస్టర్లుగా విభజించి ఇంచార్జులను నియమించారు. 14 మంది మంత్రులు, 72 మంది ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఎంపీటీసీ పరిధికి ఒక్కో ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా నియమించారు. మంత్రులను కూడా ఎంపీటీసీ పరిధి వరకే పరిమితం చేశారు.
KCR Munugode Campaign: తెలంగాణ సీఎంవో అధికారులు మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన, బసకు సంబంధించిన ఏర్పాట్ల కోసమే సీఎంవో అధికారులు మునుగోడులో తిరుగుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ బస కోసం మునుగోడు, చండూరు, చౌటుప్పల్ లో భవనాలను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ముడింటిలో ఏదో ఒకటి కన్ఫ్యామ్ చేసిన తర్వాత కేసీఆర్ మునుగోడుకు వస్తారని.. వారం రోజుల పాటు ఇక్కడే ఉంటారని అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.