Munugode bypoll Updates: ఎన్నిక షెడ్యూల్ రాకముందే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలో లీడర్ల వలసలు జోరందుకున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరు దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది.
Munugode Bypoll: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే బైపోల్ ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. అయినా ప్రచారం మాత్రం
ఓ రేంజ్ లో సాగుతోంది. పార్టీల హడావుడి చూస్తే ఉప ఎన్నిక వచ్చిందనే భావన కన్పిస్తోంది
Munugode Bypoll : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన ప్రియాంక గాంధీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
CPI Narayana: తెలంగాణలో రాజకీయాలు వేడి మీద ఉన్నాయి. మునుగోడులో బీజేపీ సభ తర్వాత మరింత హీటెక్కాయి. ఈక్రమంలో కేంద్రమంత్రి అమిత్ షాపై సీపీఐ సీనియర్ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Munugode By Election: మునుగోడు ఉప ఎన్నిక సామాన్య జనాలకు ఉపాధిగా మారింది. పార్టీల ప్రచారాలు, బహిరంగ సభలు జనాలకు కూలీ కల్పిస్తోంది. వ్యవసాయ పనులకు వేళ్లే కూలీలు కొన్ని రోజులుగా పార్టీల పనికి వెళుతున్నారు. సభకు వెళ్లినా, ప్రచారానికి వెళ్లినా ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు. దీనికి మందు, బిర్యానీ అదనం. పురుషులకు నగదుతో పాటు బీరు, బిర్యానీ అందిస్తున్నారు
Munugode By Election: అమిత్ షా సభతో మునుగోడులో బీజేపీలో జోష్ కనిపిస్తోందని తెలుస్తోంది. ఊహించిన దానికంటే అమిత్ షా సభ కు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారని స్థానిక నేతలు చెబుతున్నారు.ముందు రోజు జరిగిన కేసీఆర్ సభ కంటే బీజేపీ సమరభేరీ సభకు జనాలు ఎక్కువగా వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది
Amit Shah: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. మునుగోడులో సమర భేరిని బీజేపీ నిర్వహించింది. సభలో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్ షా..కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana Politics: తెలంగాణలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ చిత్రం మారిపోనుందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టింది సీపీఐ
Amit Shah Meets Jr NTR: తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామం జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కాబోతున్నారనే సమాచారం వస్తోంది.
Kcr Munugode Meeting : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో హుజురాబాద్ తరహాలోనే మునుగోడు నిధులు భారీగా వస్తాయనే ప్రచారం సాగింది. మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలోనే నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తారని అంతా ఆశించారు.
CM Kcr: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈక్రమంలో టీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించింది.
Munugode Bypoll: మునుగోడు.. మునుగోడు.. తెలంగాణ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే పేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనుండటంతో తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల నేతలు మునుగోడు చుట్టేస్తున్నారు.
Revanth Reddy On Munugode: మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్, బీజేపీ దూకుడు పెంచాయి. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో నిర్వహించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Munugode Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సంబంధం లేకుండా రాజేందర్ సమక్షంలో వివిధ పార్టీల నేతలు కషాయ కండువా కప్పుకుంటున్నారు. ఈ చేరికలే మునుగోడు బీజేపీలో వివాదానికి కారణమయ్యాయని తెలుస్తోంది. పాత, కొత్త నేతల మధ్య అప్పుడే కోల్డ్ వార్ మొదలైందని చెబుతున్నారు. స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కూడా బీజేపీ లో చేరుతున్నారని.. అలాంటి వారితో పార్టీకి నష్టమని ముందు నుంచి బీజేపీలో ఉన్న నేతలు చెబుతున్నారు.
BIG SHOCK TO TRS: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సవాల్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికకు ముందు కారు పార్టీకి హ్యాండిచ్చారు నేతలు. అది కూడా సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటనకు వస్తున్న ఆ రోజే.. ఆ జిల్లా నేతలే పార్టీకి రాజీనామా చేయడం గులాబీ పార్టీకి షాకింగ్ గా మారింది.
Munugode Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. అన్ని పార్టీల నేతలు మునుగోడు చుట్టేస్తున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభ శనివారం ఉండగా... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ సభ ఆదివారం బీజేపీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం నుంచి మునుగోడులో పాదయాత్ర చేస్తున్నారు. ప్రధాన పార్టీల అగ్ర నేతల పర్యటనలతో మునుగోడు రాజకీయం హీటెక్కింది.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్, బీజేపీ దూకుడు పెంచాయి. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో నిర్వహించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత తండాలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. తర్వాత చౌటుప్పల్ లో పర్యటించారు
Kcr Munugode Meeting: మునుగోడులో జరగనున్న సీఎం కేసీఆర్ సభను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీగా జనసమీరణచేస్తోంది. లక్ష మందికి పైగా జనాన్ని తరలించాలని టార్గెట్ గా పెట్టుకుంది. కేసీఆర్ మునుగోడు సభకు హైదరాబాద్ నుంచి భారీగా జనాన్ని తరలిస్తోంది అధికార పార్టీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.