Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో కాంగ్రెస్ పడింది. ఈనేపథ్యంలో హైదరాబాద్ గాంధీ భవన్‌లో మునుగోడు ఆశావహుల సమావేశం జరిగింది. ఆశావహ నేతలతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. వారి నుంచి వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా సమిష్టిగా పనిచేయాలని నేతలకు సూచించారు. ఈసమావేశంలో పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్‌తోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
అనంతరం హైదర్‌గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆశావాహులతో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ భేటీ అయ్యాయి. ఆ తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కమ్ ఠాగూర్‌తో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. టికెట్ ఎవరికీ ఇవ్వాలన్న దానిపై చర్చించారు. అభ్యర్థుల బలాబలాలు, బలహీనతలపై ఏఐసీసీకి పీసీసీ పంపనుంది. ఆ తర్వాత ఏఐసీసీ నుంచి అభ్యర్థి పేరు అధికారికంగా రానుంది.
కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. రాజీనామాను స్పీకర్ ఆమోదం తెలిపారు. దీంతో మునుగోడు స్థానం ఖాళీ అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి శాసన సభ కార్యదర్శి తెలియజేశారు. త్వరలో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈఏడాది చివర్లో హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీతోపాటు మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఈనేపథ్యంలో మునుగోడుకు సైతం ఎన్నిక జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. తెలంగాణలో గతంలో ఎన్నడూలేనివిధంగా త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలో పేర్లు ఖరారు కానున్నాయి. ఇప్పటికే మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశాయి. త్వరలో కాంగ్రెస్ సైతం మీటింగ్ పెట్టనుంది. సభలో ఆ పార్టీ అగ్ర నేతలు ప్రియాంకగాంధీతోపాటు పలువురు పాల్గొననున్నారు.
Also read:CJI NV Ramana: హైదరాబాద్ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్..పచ్చజెండా ఊపిన సీజేఐ ఎన్వీ రమణ..!
Also read:Raja Singh: రాజాసింగ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా..? తాజాగా పోలీసుల నుంచి నోటీసులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి