బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) వేడి తారస్థాయికి చేరింది. వారంలో బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ (BJP) నాయకుల్లో కరోనా భయం పట్టుకుంది.
దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus) రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను సైతం పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా బీహార్‌కు చెందిన మంత్రి కరోనాతో మరణించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఈ కూటమికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యం వహించనున్నారు. అందరూ ఊహించినట్లుగానే 50:50 సీట్లను బీజేపీ, జేడీయూ పంచుకున్నాయి.
బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
బీహార్ ఎన్నికల్లో పోటీ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Jagat Prakash Nadda ) కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోభారతీయ జనతా పార్టీ (BJP), జనతాదళ్ యునైటెడ్ (JDU), లోక్ జనశక్తి పార్టీ (LJP) కలిసి పోటీ చేస్తాయని నడ్డా స్పష్టంచేశారు.
lightning strikes | ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం పిడుగులు పడి ఆయా రాష్ట్రాల్లో 43మంది మరణించగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
lightning strikes | ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు బిహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుల కారణంగా మరణించిన వారి సంఖ్య 115కి చేరింది. దీంతో ప్రభుత్వం పదిజిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు ఆర్జేడీ నేతలు పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాకిచ్చారు. ఆర్జేడీా ఎమ్మెల్సీలు అనూహ్యంగా సీఎం నితీష్ కుమార్ పార్టీలో చేరిపోయారు.
పౌరసత్వ సవరణ బిల్లు 2019 (CAB 2019), జాతీయ పౌర పట్టిక(NRC)లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ రెండు అంశాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
మిత్రపక్షాలను కూడగట్టేందుకు దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్న అమిత్ షా ఇప్పుడు బీహార్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం బీహార్ సీఎం నితీష్ కుమార్ తో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. జేడీయూ, బీజేపీల మధ్య సంబంధాలు కొంచెం బలహీనమయ్యాయనే వార్తలు వస్తున్న తరుణంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.