Kadapa: కడప జిల్లా జమ్ముల మడుగులో మైలవరం డ్యామ్‌కు గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెన్నా పరివహక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల మధ్యలోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ పనులు మాత్రం పూర్తి కావట్లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు జిల్లాలో 1లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంచనా వ్యయం పెరుగుతున్నా ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి.
Penna River Bridge: ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో పెన్నా నది వంతెన కుంగిపోయింది. నది ప్రవాహం ఉధృతికి.. వంతెన మధ్య భాగం ఒంగిపోయింది. దీంతో వంతెనపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కడప జిల్లాలోని సిద్ధవటంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెన్నా నదిలో సరదాగా స్నానం చేయడానికి వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.