Sharmistha Mukherjee Reaction: బీజేపీ అప్రజాస్వామిక మార్గాల ద్వారా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె షర్మిష్ట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు అనేవి విలువలు పెంచేలా ఉండాలి కానీ, దిగజారేలా ఉండకూడదంటూ కామెంట్లు చేశారు.
Abhijit Mukherjee joins TMC: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఊహాగానాలను నిజంచేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్దతు తెలుపుతున్నారు.
భారతరత్న, మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని స్మరించుకుంటూ తెలంగాణ శాసనసభ సమావేశాలలో భాగంగా నేడు సభలో ఆయనకు సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభలో సంతాప తీర్మానాన్ని ( Tribute to Pranab Mukherjee ) ప్రవేశపెట్టారు.
మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీకి 10 రాజాజీమార్గ్‌లోని తన అధికారిక నివాసంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ముందుగా రక్షణ అధికారులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంజలి ఘటించారు.
మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ పార్థీవ దేహాన్ని న్యూఢిల్లీ ఆర్మీ ఆసుపత్రి నుంచి 10 రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసానికి మంగళవారం ఉదయం అధికారులు తరలించారు. ఆయన పార్థీవ దేహానికి పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.
మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ (84) సోమవారం ఢిల్లీలోని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే.. మంగళవారం ఉదయం 8గంటలకు ఆర్మీ ఆసుపత్రి నుంచి పార్థీవ దేహాన్ని రాజాజీమార్గ్‌లోని ప్రణబ్ అధికారిక నివాసానికి తరలించనున్నారు.
కరడుగట్టిన కాంగ్రెస్ వాదే అయినప్పటికీ.. ఒకానొక సందర్భంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ( Pranab Mukherjee ) ప్రవర్తనపై సొంత పార్టీనే కస్సుబుస్సులాడింది. తప్పు చేస్తున్నావు దాదా అంటూ పలువులు కాంగ్రెస్ పార్టీ ( Congress leaders ) నేతలు ఆ పెద్దాయనకే హితవు పలికారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ( Pranab Mukherjee ) ఇక లేరనే చేదు నిజాన్ని యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. వివాదాలకు దూరంగా.. అజాతశత్రువుగా అందరి మనసు దోచుకున్న నాయకుడు ఆయన. తన జీవితాన్ని అంతా ప్రజాసేవకే ధారపోసిన ఆ రాజకీయ దిగ్గజం అంటే ఎవరికైనా ఇష్టమే.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Ex president Pranab mukherjee ) ఆరోగ్యం మరింతగా విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ సోకడంతో..ఇంకా వెంటిలేటర్ పైనే కొనసాగిస్తున్నట్టు ఢిల్లీ కంటోన్మెంట్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
కరోనా ( Coronavirus ) మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరిన భారత మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) కి ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి వైద్యులు ప్రణబ్ ముఖర్జీని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
భారత మాజీ రాష్ట్రపతి ( Ex-President ) ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) కోవిడ్-19 ( Covid-19 ) బారిన పడటంతో ఆయనకు చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 10న ఆయనకు ఆపరేషన్ నిర్వహించి మొదడులో ఉన్న కణితిని కూడా తొలగించారు వైద్యులు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) చనిపోయినట్టుగా వస్తున్న తప్పుడు కథనాలను ( Fake news ) ఆయన కుమారుడు అభిజీత్ ముఖర్జీ తీవ్రంగా ఖండించారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Former president Pranab Mukherjee ) ఇక లేరని బుధవారం రాత్రి సోషల్ మీడియాలో పలు వదంతులు వ్యాపించాయి. ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుమూశారని ఆయనకు నివాళులు అర్పిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి తెరతీశారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నట్లు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (RR) ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Pranab Mukherjee ) ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. కరోనా (Coronavirus) సోకడంతో నిన్ననే ఆయన ఆసుపత్రిలో చేరారు.
కరోనా మహమ్మారి ( Corona pandemic ) కి నీ నా తేడా ఉండటం లేదు. అందర్నీ వశపర్చుకుంటుంది. మొన్న అమితాబ్ కుటుంబం..నిన్న అమిత్ షా...నేడు మాజీ రాష్ట్రపతి. ఇప్పుడీ విషయాన్ని స్వయంగా ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తానని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.