Gulam Nabi Azad Comments On Congress Party Leadership | కాంగ్రెస్ పార్టీలో లోపాలను ఎత్తిచూపుతూ పార్టీ ప్రక్షాళన అంశంపై సోనియాకు ఘాటు లేఖ రాసిన 23 మంది నేతలలో ఒకరైన గులాం నబీ ఆజాద్ పార్టీలో అంతర్గత వ్యవహారాలను తప్పుపట్టారు.
రోనా వైరస్ మహహ్మారి ( Coronavirus ) విజృంభిస్తున్ననేపథ్యంలో జేఈఈ 2020 ( Joint Entrance Examination 2020 ), నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 ( NEET 2020 ) పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలు పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశవ్యాప్త వ్యతిరేకత మధ్యనే తాజాగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చాలా వాడీవేడిగా జరుగుతోంది. ఈ సమావేశం కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి జరుగుతుందని ముందుగా అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇది సీన్ రివర్స్ అయి 23మంది సీనియర్లు రాసిన లేఖ చుట్టూ తిరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభంపై చర్చించేందుకు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక సమావేశం వాడీవేడీగా కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నేతలపై రాహుల్ గాంధీ ఆగ్రహం (Rahul Gandhi Comments At CWC) వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి ఆయన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణ గురించి ప్రశ్నలు సంధించారు.
నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. అతిపిన్న వయసులో ప్రధాని అయి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన నేత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi On Rajiv Gandhi Birth Anniversary) నివాళులర్పించారు.
సామాజిక మాధ్యమాల్లో తనపై శృతి మించి జరుగుతున్న ప్రచారం, వదంతులు అనేక అపోహలకు దారితీస్తున్నందున తాను ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఈ వివరణ ఇస్తున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
రాజస్థాన్ సంక్షోభం సమసినట్టే కన్పిస్తోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తో కాంగ్రెస్ అధిష్టానం జరిపిన చర్చలు సఫలీకృతమైనట్టుగా తెలుస్తోంది. సచిన్ పైలట్ వ్యాఖ్యలే దీనికి కారణం. ఐదేళ్ల కోసం కష్టపడి ప్రభుత్వం ఏర్పరిచామని సచిన్ వ్యాఖ్యానించడమే దీనికి కారణం.
గత కొన్ని రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరి క్యాంపు వారిదన్నట్లు వ్యవహరించిన కాంగ్రెస్‌లోని వర్గాలు సయోధ్యకు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నెల రోజుల నుంచి రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన సచిన్ పైలట్ మరలా యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని లక్ష్యంగా చేసుకుంటూ పలు విమర్శలు సంధించారు. గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘటన నాటినుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.
Rajasthan political crisis: కాంగ్రెస్ పార్టీని వీడే నాయకులను ఉద్దేశించి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్టీ నుంచి వెళ్లాలనుకునే వాళ్లను వెళ్లనివ్వండని పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి.
సచిన్ పైలట్ ( Sachin Pilot ) . ఇప్పుడీ పేరు చుట్టే మొత్తం రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం ( Rajasthan Government ) సంక్షోభం వైపుకు వెళ్తుండటానికి కారణం ఈ పేరే. రాజస్తాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ వర్సెస్ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వివాదానికి కారణమేంటి ? సచిన్ పైలట్ నేపధ్యమేంటి ?
రాహుల్ గాంధీ ఎప్పటిలాగానే తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన నాటినుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. వికాస్ దుబేకు సహకరించిన అధికారులు, నాయకులపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రతిపక్షాలన్నీ యూపీ బీజేపీ ప్రభుత్వాన్ని ( UP govt ) చుట్టుముడుతున్నాయి. 8న కాన్పూర్‌లో 8 మంది పోలీసులను దారుణంగా హత్య చేసిన వికాస్ దుబే మధ్యప్రదేశ్ ఉజ్జయిని ( Ujjain ) వరకు ఎలా చేరుకున్నాడని, ఎవరి ప్రమేయం లేకుండానే ఆయన అక్కడి వరకు చేరుకుని ఉంటాడా అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.
https://zeenews.india.com/telugu/tags/rahul-gandhiభారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై, ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
లడఖ్‌లోని గాల్వన్‌లోయలో భారత సైన్యంలోని 20 మంది సైనికులు అమరులు కావడంతో దేశమంతా అట్టుడికిపోతోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ నాయకులు ఘాటు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్
'కరోనా వైరస్' దేశ ప్రజలను అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేసిందని కాంగ్రెస్ ఎంపీ, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు భారతీయులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ముఖ్యంగా వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుణఎగవేతదారుల రుణాలను మాఫీ చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.