Pilot meets Rahul Gandhi: న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరి క్యాంపు వారిదన్నట్లు వ్యవహరించిన కాంగ్రెస్‌లోని వర్గాలు సయోధ్యకు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నెల రోజుల నుంచి రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన సచిన్ పైలట్ మరలా యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న వేళ గెహ్లాట్ ( Ashok Gehlot ) ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్‌ను ఎలాగొలా బుజ్జగించేందుకు రంగంలో దిగి ఆయన్ను సముదాయించారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు సచిన్ పైలట్ ( sachin pilot ) సోమవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీలను కలిశారు. వారితో భేటీ అనంతరం సచిన్ పైలట్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటికి చేరుకున్నారు. Also read: Rajasthan Congress MLAs: జైపూర్ నుంచి జైసల్మేర్‌కు రాజస్థాన్ హైడ్రామా
సుమారు రెండు గంటల పాటు రాహుల్, ప్రియాంక (priyanka gandhi)లతో జరిగిన ఈ భేటీలో సచిన్ పైలట్ డిమాండ్ల పరిష్కారానికి హామీ లభించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రాజస్థాన్‌లో నెల రోజులుపైగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. Also read: Rajastan crisis: పైలట్ చేతుల్లో ఏం లేదు.. డ్రామా అంతా బీజేపిదే: అశోక్ గెహ్లట్
అయితే ఈ నెల 14న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశంలో సీఎం అశోక్ గెహ్లాట్ సభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైసల్మేర్‌లోని ఓ హోటల్లో ఆయన ఉంచారు. సచిన్ పైలట్ వెంట కూడా 18 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ( Also read: Sachin Pilot: సత్యాన్ని ఓడించలేరు )