Revanth Reddy To Etela Rajender: “రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.. ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను సీఎం కేసీఆర్‌తో పోరాటం చేస్తా.. అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా... మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే... నా కుటుంబం సర్వ నాశనమైపోతుంది” అని చెబుతూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
Revanth Reddy About Etala Rajender: ఈటల రాజేందర్.. ఆలోచించి మాట్లాడాలి. రాజకీయం కోసం మాలాంటి వారిపై ఆరోపణలు చేస్తావా? నిన్ను అసెంబ్లీలో కేసీఆర్ అభినందించి ఉండవచ్చు.. నా పోరాటానికి నీవు సజీవ సాక్ష్యం కాదా రాజేంద్రా. రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు... ఆలోచించి మాట్లాడు.. అని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు.
DK Aruna : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇరవై ఐదు కోట్లు కేసీఆర్ ఇచ్చారని ఈటెల ఆరోపణల మీద డీకే అరుణ స్పందించారు. రేవంత్ రెడ్డి ఖండించిన వ్యాఖ్యల మీద సైతం అరుణ మాట్లాడారు. నిజం మాట్లాడితే రేవంత్ రెడ్డికి ఎందుకు రోషం అని సెటైర్లు వేశారు.
Komatireddy Raj Gopal Reddy on Revanth Reddy: ఎమ్మెల్సీ కవితతో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు చేస్తున్నారని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రాజకీయ వ్యభిచారి అంటూ తీవ్రస్థాయంలో మండిపడ్డారు. నోట్ల కట్టలతో రెడ్ హాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లిన చరిత్ర రేవంత్ రెడ్డిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy : తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే భేటీల పరంపర కొనసాగుతోంది. రేణుక చౌదరితో రేవంత్ భేటీ అవ్వడంతో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Mallu Bhatti vikramarka Padayatra: పెద్దపల్లి జిల్లాలో మరోసారి కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
Revanth Reddy on Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామని చెప్పారని.. కానీ ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా.. అంటూ తప్పించుకున్నారని అన్నారు.
Revanth Reddy Speech: వచ్చే ఎన్నికల్లో దళితుల ఓట్లు దండుకోవడం కోసమే దళితులపై ప్రేమ కురిపిస్తున్నట్టుగా కేసీఆర్ ఈ కొత్త డ్రామాలకు తెరతీశారు. అవినీతి ఆరోపణలతో ఆనాడు దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన కేసీఆర్.. మరి ఈనాడు కుంభకోణాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడుకు కేటీఆర్ ని మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
Revanth Reddy Press Meet About ktr: ఈ ప్రాజెక్టులో ఒక్కో అపార్ట్మెంట్ సగటున 8000 ఎస్ఎఫ్టీతో నిర్మాణం చేపడుతున్నారు. ఇట్లా 200 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ఇంత లగ్జరీ (సుమారు రూ.20 కోట్లకు ఒక అపార్ట్మెంట్) అపార్ట్మెంట్ కొనుగోలు చేసే వాళ్లు ఇంటికి కనీసం 5 కార్లు ఉంటాయి. ఆ లెక్కన వేసుకుంటే మొత్తం 1000 కార్లు ఈ నిర్మాణంలో ఉంటాయి. ఈ వెయ్యి కార్లు ఉదయం ఒకేసారి బయటకు వస్తే పరిస్థితి ఊహించుకోవచ్చు.
Revanth Reddy Slams KCR and KTR: కేబీఆర్ పార్కు నుంచి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లే దారిలో బీసీ స్టడీ సర్కిల్ సమీపంలో నిజాం నవాబులకు చెందిన ఒక హెరిటేజ్ భవనం ఉండేది. ఈ భవనాన్ని కుర్ర శ్రీనివాస రావుకు చెందిన కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ స్థలంలో కమెర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy's Reply to Minister KTR's Notices: టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా ఇందులో తన పేరు లాగి తన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రతిపక్ష నేతలైన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, బీజేపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ లపై పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
Revanth Reddy Comments on Alliance with BRS: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తులపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మాఫియాతో చేతులు కలపదని.. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బీఆర్ఎస్తో పొత్తు ఉండదన్నారు.
Revanth Reddy On TSPSC Paper Leak: టీఎస్పీఎస్ పేపర్ల లీక్ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్‌పై వ్యగ్యంగా కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేశారు. మీకర్థమవుతోందా.. పరువు గల కేటీఆర్ గారూ..! అంటూ సెటైర్లు వేశారు.
Sharmila Phonecall To Bandi Sanjay And Revanth Reddy: తెలంగాణలో నిరుద్యోగ సమస్య కలిసి పోరాడుదామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేశారు. కేసీఆర్ మెడలు వంచాలంటే అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
Bandi Sanjay Reaction on KTR Notices: కేసీఆర్ కొడుకు పరువు, ప్రతిష్ట విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లయితే, తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ మీ పాలనవల్ల ప్రశ్నార్థమైంది. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలి. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు అంటూ మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు.
KTR Defamation Suit: హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏఈ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు లీగల్ నోటీసులు పంపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.