YS Sharmila Revanth Reddy Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునఃప్రవేశించిన తర్వాత తొలిసారి మళ్లీ తెలంగాణలో వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కావడం గమనార్హం.
Harish Rao Assembly Speech: తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులపై చర్చ జరగ్గా అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధమే జరిగింది. హరీశ్ రావు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
Bonthu Rammohan: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. కీలక నాయకులంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కీలక నాయకుడు ముఖ్యమంత్రిని కలిశారు.
Raithu Bandhu: రైతు పెట్టుబడులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుపై కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనేపథ్యంలో రైతు పెట్టుబడి రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
Rythu Bharosa: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులకు భారీ షాకిచ్చింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం విషయంలో ఆంక్షలు విధించింది.
Patnam Mahender Reddy Meets Revanth Reddy: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేటట్టు పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలవడంతో రాజకీయాల్లో కలకలం ఏర్పడింది.
Singareni Job Fair: తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనలు ఊరిస్తున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించినా ఇంకా ఉద్యోగ ప్రకటనలు విడుదల కావడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనలు వేస్తామని ప్రకటించారు.
Sonia Contest In Telangana: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్‌సభ సమరంలోనూ పునరావృతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని కొన్నాళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా సోనియాను కలిసి ఈ విన్నపాన్ని చేశారు.
Congress Changes: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచల నిర్ణయాలు తీసుకుంది. పదేళ్లుగా ఉన్న తెలంగాణ అధికారిక గుర్తులను చెరిపేయాలని నిర్ణయించింది. పేరు, ఊరు, చిహ్నం, తల్లి ఇలా అన్నింటినీ మార్చేయడానికి సిద్ధమైంది.
Krishna Projects: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కృష్ణా జలాల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లతో తెలంగాణలో జల యుద్ధానికి తెరలేచింది. రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు స్వీకరించి.. అసెంబ్లీలో చూసుకుందామని ప్రతి సవాల్ విసిరారు.
Chiranjeevi - Gaddar Awards: తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు నిలిచిపోయాయి. తాజాగా కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నంది అవార్డులు స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తానంటూ ప్రకటించారు. దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ గద్దర్ అవార్డ్ పై చిరంజీవి స్పందించారు.
Telangana Government - Padma Award Winners: రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య నాయుడు, చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. వారికి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం శిల్పాకళావేదికలో సన్మానించింది.
Mohan Babu Reaction Gaddar Awards: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సినీ అవార్డుల విషయంలో తీసుకున్న పేరు మార్పుపై సినీ పరిశ్రమ నుంచి స్పందన లేదు. నంది అవార్డులను గద్దర్ పేరిట ఇస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఈ నిర్ణయంపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్పందించారు.
Auto Workers Free Bus: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా మరో అంశంపై కేటీఆర్ కాంగ్రెస్‌ను నిలదీశారు. అయితే ఈసారి రేవంత్ రెడ్డికి లేఖరూపంలో విజ్ఞప్తి చేయడం విశేషం.
Free Power Scheme: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. మరో రెండు హామీలను నెరవేరుస్తామని ఇంద్రవెల్లి వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు.
Gaddar Awards - Revanth Reddy: రేవంతన్న ఈ గద్డర్ అవార్డ్స్ ఏంటన్నా ? అని అడుగున్నారు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమావాళ్లకు సింహా అవార్డ్స్ ఇస్తామంటూ చెప్పినా.. ఆ దిశగా ముందడుగు పడలేదు. కానీ రీసెంట్గా తెలంగాణలో ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సినిమా వాళ్లకు గద్దర్ అవార్డ్స్ ఇస్తానంటూ ప్రకటన చేయడమే కాదు.. నా మాటే జీవో అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోంది. ఈ అవార్డు ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Revanth Jobs Statement: ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగాలపై ఎలాంటి బెంగ అక్కర్లేదని.. సంవత్సరంలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో యువత చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
Revanth Reddy Indravelli Tour: ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యవహారాలను ఒక కొలిక్కి తీసుకొచ్చిన రేవంత్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు.
Kishan Reddy Railway Lands: భూముల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో రైల్వే అభివృద్ధి పనుల కోసం భూములు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపారు. రోడ్ల విస్తరణ, స్టేషన్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని లేఖలో కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.