Gaddar Awards - Revanth Reddy: రేవంతన్న ఈ గద్డర్ అవార్డ్స్ ఏంటన్నా ? అని అడుగున్నారు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమావాళ్లకు సింహా అవార్డ్స్ ఇస్తామంటూ చెప్పినా.. ఆ దిశగా ముందడుగు పడలేదు. కానీ రీసెంట్గా తెలంగాణలో ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సినిమా వాళ్లకు గద్దర్ అవార్డ్స్ ఇస్తానంటూ ప్రకటన చేయడమే కాదు.. నా మాటే జీవో అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోంది. ఈ అవార్డు ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Revanth Jobs Statement: ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగాలపై ఎలాంటి బెంగ అక్కర్లేదని.. సంవత్సరంలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో యువత చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
Revanth Reddy Indravelli Tour: ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యవహారాలను ఒక కొలిక్కి తీసుకొచ్చిన రేవంత్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు.
Kishan Reddy Railway Lands: భూముల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో రైల్వే అభివృద్ధి పనుల కోసం భూములు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపారు. రోడ్ల విస్తరణ, స్టేషన్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని లేఖలో కోరారు.
Telangana Health Profile Card: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి క్రమంగా పాలనపై దృష్టి సారించారు. ఈ క్రమంలో వైద్యారోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించి ఆయా శాఖలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Kamareddy: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేతలను ఓడించి సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఏమైనా చేస్తానని చెబుతూ తన ఇంటినే కూల్చేసుకున్నారు. రోడ్డు నిర్మాణంలో అడ్డుగా ఉందని చెబుతూ తన ఇంటిని కూల్చారు.
Cast Census: దేశంలో ఇతర రాష్ట్రాల్లో చేపట్టినట్లు తెలంగాణలోనూ కులగణన చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కుల గణన కోసం ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై చేపట్టిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు ఆయా శాఖలపై అభివృద్ధి, సంక్షేమ పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Padma Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై పలువురు వెంకయ్య నాయుడుగారికి,చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Telagana Radar Station: భారత నావికా దళానికి తెలంగాణ మరో విశిష్ట సేవలు అందించనుంది. నౌకలు, జలాంత్గరాములకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం తెలంగాణలో ఒక రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది. దశాబ్దా కాలంగా కొనసాగుతున్న ఈ స్టేషన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. భూముల కేటాయింపు, నిధుల చెల్లింపు ప్రక్రియకు పీటముడి వీడింది. 2027లో ఈ కేంద్రం అందుబాటులోకి రానుండడం విశేషం.
High Alert in BRS Party: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం కావడం కలకలం రేపింది. ఈ సమావేశం గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. ఆ పార్టీలో చీలిక మొదలైందా..? కాంగ్రెస్‌తో టచ్‌లోకి వచ్చారా అనేది చర్చ జరుగుతోంది.
KTR Call To Public: ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారంలోకి వచ్చి నెలన్నర అవుతుండడంతో ఎప్పుడు హామీలు నిలబెట్టుకుంటారంటూ ప్రశ్నిస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించిన 'ఉచిత విద్యుత్' హామీని అమలుచేయాలని ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులు ఎవరూ చెల్లించవద్దని సూచించడం కలకలం రేపింది.
London Tour: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి విదేశాల్లో ప్రత్యేకత చాటుతున్నారు. దావోస్ సదస్సును విజయవంతం చేసి పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతమైన రేవంత్ రెడ్డి అనంతరం లండన్‌లో కూడా మెరిశారు. ప్రభుత్వ పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ దేశంలో రేవంత్ అరుదైన గౌరవం పొందారు. ప్రఖ్యాత ప్యాలెస్‌లో ఆయన ప్రసంగం చేశారు.
Telangana Success in Davos: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం తడాఖా చూపించింది. దావోస్‌లో జరిగిన సదస్సులో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలి రోజే ఊహించని స్థాయిలో పెట్టుబడులు రాగా.. రెండో రోజు కూడా వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తరలివచ్చాయి. పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన దావోస్ పర్యటన విజయవంతమైంది. స్విట్జర్లాండ్ నుంచి తెలంగాణ రూ.40,232 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం విశేషం.
Telangana Investments: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. తొలి రోజే ఊహించని స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయి. సదస్సు ప్రారంభం నాడే రూ.37,870 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు అదానీ, గోద్రెజ్, జేఎస్‌డబ్ల్యూ, గోడి, వెబ్ వర్క్స్, ఆరాజెన్ వంటి కంపెనీలు ముందుకొచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.