No Entry for Ambulance: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. సరిహద్దుల్లో అంబులెన్స్‌ను ఇంకా అడ్డుకుంటున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రోగి బంధువులతో గంటల తరబడి వాగ్వాదం కొనసాగుతోంది.
Covid Border Dispute: కరోనా ఉధృతి నేపధ్యంలో సరిహద్దుల వద్ద వివాదం ప్రారంభమవుతోంది. తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ రోగుల్ని అడ్డుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు ఇబ్బంది పడుతున్నారు.
Lathi charge at Gurrambodu thanda during protest by BJP: సూర్యాపేట: మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులైన గిరిజనులకు గుర్రంబోడులోని 540 వ సర్వే నెంబర్లో దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది.
Police and Municipal staff to get COVID-19 vaccine: హైదరాబాద్: రేపటి నుంచి పోలీస్, మున్సిపల్ సిబ్బందికి కొవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. కరోనావైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి ఈటల తెలిపారు.
Dr jayaram murder case: ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ, న్యూస్ ఛానెల్ అధినేత డాక్టర్ జయరాం హత్యకేసు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ కేసులో పోలీసు అధికారుల పాత్రపై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ (Telangana) లోని సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట తెల్లవారే సరికి విగతజీవులుగా కనిపించారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ( Telangana State Election Commission) హైకోర్టు నుంచి షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాలిచ్చింది.
మాటల తూటాలు పేలిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో (GHMC Election 2020 ) ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. బల్దియాలో ఎవరు పట్టు నిలుపుకోనున్నారు.. పోటీ చేసిన 1,122 మంది అభ్యర్ధుల్లో గెలిచే 150 మంది నేతలు ఎవరు..? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు కావడంతో వాయిదా పడిన ఓల్డ్ మలక్‌పేట (old malakpet) డివిజన్ రీపోలింగ్ (re polling ) ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling ) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ (GHMC Polling begins ) ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లల్లో మంగళవారం ఉదయం 7గంటలకు కోవిడ్ (Covid-19) నిబంధనలతో ప్రారంభమైంది.
తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ (Hyderabad) నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో (Telangana) మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని.. అలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
నలుగురు యువకులు బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ ( drinking alcohol in public) పోలీసులకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో మత్తులో ఉన్న ఓ యువకుడు ఏకంగా పోలీసుల (Telangana Police) వాహనంతోనే పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కట్ చేస్తే.. చివరికి మరో వాహనాన్ని ఢికొట్టాడు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను జలప్రళయం మరోసారి ముంచెత్తింది. రెండు రోజుల క్రితం భారీ వర్షాలతో అతలాకుతలమయిన నగరాన్ని భారీ వర్షంతో వరదలు చుట్టుముట్టాయి. ఎటుచూసినా నీరే కనిపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎటుచూసినా నీరే కనిపిస్తుండంటంతో భాగ్యనగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 15 కు చేరింది.
సమాజంలో జరుగుతున్న నేరాలు, ఆన్లైన్ మోసాలపై హైదరాబాద్ నగర పోలీసులు (Hyderabad city police) ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిదే. ఓవైపు నేరాలతో పాటు సామాజిక చైతన్యం కలిగించేలా వీడియోలను రూపొందించి అవగాహన కలిగించడంలో హైదరాబాద్ సిటీ పోలీసులు (Telangana Police) ఎప్పుడూ ముందే ఉంటారు.
నవ తెలంగాణలో యువ ఐపీఎస్ రక్తం వచ్చి చేరింది. శిక్షణ పూర్తి చేసుకున్న 11 మంది ఐపీఎస్ లకు తెలంగాణ రాష్ట్రంలో పోస్టింగ్ లభించింది. గ్రేహౌండ్స్ శాఖలో కొత్త ఐపీఎస్ లు విధులు నిర్వహించబోతున్నారు.
స్వధాత్రి ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ ( Swadhathri infra pvt ltd ) పేరిట యార్లగడ్డ రఘు అండ్ గ్యాంగ్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ పాల్పడిన మోసాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యార్లగడ్డ రఘు వాస్తవానికి ఏడాదిలోపే రూ. 1000 కోట్లు కొల్లగొట్టాలని పథకం రచించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.