తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఉమెన్ సేఫ్టీ విభాగం ఇటీవల సైబ్హర్ #CybHer పేరిట ప్రారంభించిన క్యాంపెయిన్‌లో ఇప్పటికే ప్రముఖ సినీనటుడు నాని, ప్రముఖ యాంకర్ సుమ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పాల్పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ అనసూయ కూడా ఈ #CybHer campaign లో పాల్గొంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఖమ్మం-క్రిష్ణా జిల్లా సరిహద్దుల్లో తిరువూరులోని ఆంధ్రా-తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తోన్న పోలీసులు.. ఓ కారులో ఇద్దరు వ్యక్తులు భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు తరలిస్తుండటాన్ని గుర్తించారు.
దొంగలను పట్టుకోవడం పోలీసుల డ్యూటీ. కానీ పట్టుకున్న దొంగలను వదిలేసి.. వాళ్ల చోరీల్లో వాటా పంచుకుంటే.. వాళ్లను ఏమనాలి ? ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. నగర శివార్లలోని మేడిపల్లిలో ఇటీవల డీజిల్ దొంగలు పోలీసులకు చిక్కారు. అయితే, అప్పుడు ఆ దొంగల వెనుకున్న పోలీసులు మాత్రం తాము ఎస్కేప్ అయ్యామనుకున్నారు.
కరోనా వ్యాప్తి కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు చాలా కష్టపడుతున్నారని, పోలీసుల వల్లే ప్రభుత్వం విధించినా లాక్ డౌన్ విజయవంతమవుతోందంటూ ప్రముఖ నటుడు చిరంజీవి చేసిన ట్వీట్ పై
కామాంధుల నుంచి మహిళలు, చిన్నారులకే కాదు... చివరకు పశువులకు కూడా రక్షణ లేదని మరోసారి నిరూపితమైంది. నోరు లేని పశువులపైనే పశువాంఛ తీర్చుకుంటున్న వీడిని పశువు అని పిలిస్తే.. ఆ పశువులు సైతం సిగ్గుపడతాయేమో!! సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఉన్న అవంతి నగర్లో చోటుచేసుకుంది.
గూగుల్ పే, గూగుల్ యాడ్ సర్వీసులతో పాటు గూగుల్ సెర్చ్ వేదికల ద్వారా మోసాలు వంటి పలు గూగుల్ ఆధారిత సేవల్లో అనేక సైబర్ మోసాలు జరుగుతున్నందున, నివారణ చర్యలపై యుద్దానికి సైబరాబాద్ పోలీసులు, గూగుల్ అధికారులు
తెలంగాణలో సంచలనం రేపిన దివ్య హత్యా కేసు మిస్టరీ వీడింది. రెండు రోజుల క్రితం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో బ్యాంక్ ఉద్యోగిని దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది.
తెలంగాణలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల నుంచి డబ్బు దోచుకునేందుకు రకరకాల కుయుక్తులు, కొత్త కొత్త ట్రిక్కులతో ముందుకు సాగుతున్నారు. వారి వలలో చిక్కుకున్న అమాయక జనం.. చివరకు మోసం జరిగిందని తెలుసుకున్న తర్వాత లబోదిబోమంటున్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యమని, చట్టాలను ఉల్లంఘించిన వారికి శిక్షలు పడుతున్నాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తప్పు చేసినా వారికి శిక్షలు పడే విదంగా పోలీసులు నమ్మకం కల్పించాలని, నేరం చేసిన వారిని గుర్తించాలని, కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
మద్యం తాగి కారు నడిపి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఇద్దరిని ఢీకొట్టిన కేసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైసెన్స్‌ను ఆర్టీఏ అధికారులు ఏడాదిపాటు సస్పెండ్ చేశారని సైబరాబాద్ ట్రాఫిక్ డీసిపి ఎస్ఎం విజయ్‌కుమార్ తెలిపారు.
మావోయిస్టు సానుభూతిపరులతో ఉన్న అనుబంధంపై శనివారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది కాశిం నివాసాన్ని తెలంగాణలోని జోగులాంబా గద్వాల్ జిల్లాకు చెందిన పోలీసు బృందం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సహాయంతో క్యాంపస్
ఉత్తమ పోలీస్ సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ డిపార్ట్మెంట్(విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది.
నూతన సంవత్సర 2020 వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
తెలంగాణ సివిల్ పోలీసు, ఆర్మ్డ్ రిజర్వ్డ్ (ఏఆర్) విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 17 నుంచి శిక్షణ లభించనుంది. డ్రైవర్, మెకానిక్ విభాగాలకు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు సైతం అదే రోజు నుంచి తెలంగాణ పోలీసు శాఖ శిక్షణ అందించనుంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
జాతీయ మానవహక్కుల సంఘం పంపించిన నిజ నిర్ధారణ కమిటి సభ్యులు చటాన్‌పల్లికి చేరుకుని ఎన్కౌంటర్ జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటి సభ్యుల బృందం.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించింది.
షాద్‌నగర్‌కి సమీపంలోని చటాన్‌పల్లి కల్వర్టు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
''నా భర్తను ఎక్కడైతే ఎన్కౌంటర్ చేశారో.. నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లి కాల్చిచంపండి. మా ఇద్దరికీ పెళ్లయి ఏడాదే అవుతోంది. ఇప్పుడు మా ఆయన లేకుండా నేనుండలేను''. దిశ హత్య కేసులో నిందితుడిగా ఉండి శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో హతమైన చింతకుంట చెన్నకేశవులు భార్య రేణుక ఆవేదన ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.