యాంకర్ అనసూయ #CybHer క్యాంపెయిన్‌.. ఎనర్జిటిక్ వీడియో

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఉమెన్ సేఫ్టీ విభాగం ఇటీవల సైబ్‌హర్ #CybHer పేరిట ప్రారంభించిన క్యాంపెయిన్‌లో ఇప్పటికే ప్రముఖ సినీనటుడు నాని, ప్రముఖ యాంకర్ సుమ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పాల్పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా  యాంకర్ అనసూయ కూడా ఈ #CybHer campaign లో పాల్గొంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

Last Updated : Jul 18, 2020, 11:03 AM IST
యాంకర్ అనసూయ #CybHer క్యాంపెయిన్‌.. ఎనర్జిటిక్ వీడియో

యాంకర్ అనసూయ.. తెలుగు బుల్లితెరపైనే కాకుండా, వెండితెరపైనా తనని తాను ప్రూవ్ చేసుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ లేడీ. టీవీ షోలు, అవార్డ్స్ షోలలో యాంకర్‌గా చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ తానేమీ తీసిపోనని నిరూపించుకున్న యాంకర్ అనసూయ ( Anchor Anasuya ) తాజాగా మరోసారి మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలకు బూస్టింగ్‌నిచ్చే వీడియోతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఉమెన్ సేఫ్టీ విభాగం ఇటీవల సైబ్‌హర్ #CybHer పేరిట ప్రారంభించిన క్యాంపెయిన్‌లో ఇప్పటికే ప్రముఖ సినీనటుడు నాని, ప్రముఖ యాంకర్ సుమ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పాల్పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా  యాంకర్ అనసూయ కూడా ఈ #CybHer campaign లో పాల్గొంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో, సామాజిక మాధ్యమాల్లో మహిళలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న అవమానాలపై పోరాడాల్సిందిగా యాంకర్ అనసూయ ఈ వీడియో ద్వారా సందేశమిచ్చారు. ( Also read: IIT admissions: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐఐటీల్లో ప్రవేశానికి తొలగిన అడ్డంకి )

సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చే మహిళలు, అమ్మాయిలు, పిల్లలకు తెలంగాణ పోలీసుల అండదండలు ఉంటాయని, ఉమెన్ సేఫ్టీ వింగ్ అభయం ఉంటుందని యాంకర్ అనసూయ చెప్పిన ఓ వీడియోను ఉమెన్ సేఫ్టీ వింగ్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ( Also read: Gold masks, silver masks: గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులకు పెరిగిన డిమాండ్.. ధర ఎంతో తెలుసా ? )

ఫ్రైడే ఫ్యాక్ట్ స్టోరీ విత్ యాంకర్ అనసూయ పేరిట తెలంగాణ స్టేట్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ రూపొందించిన ఈ వీడియో చూస్తోంటే... సైబర్ క్రైమ్స్ బారిన పడిన మహిళలు, అమ్మాయిలు, చిన్నారులకు కొండంత అండ లభించినట్టయింది. ఈ క్యాంపెయిన్ ప్రారంభించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీసు ( Women safety wing of Telangana state police ), అందులో భాగమైన వాళ్లను అందరినీ అభినందించి తీరాల్సిందే.

( Also read: COVID-19 treatment: ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఆరాధ్య )

Trending News