Total 15 deaths have been registered in Hyderabad: హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( heavy rains) నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎటుచూసినా నీరే కనిపిస్తుండంటంతో భాగ్యనగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 15 కు చేరింది. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని గౌస్‌నగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి రెండు ఇళ్లు కూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతోపాటు శంషాబాద్‌లోని గగన్‌పహాడ్ ప్రాంతంలో కూడా రాత్రి ఇంటి గోడ కూలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు మరో రెండు చోట్ల నలుగురు మరణించారని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ (GHMC) ప్రాంతంలో ఇప్పటివరకు మరణించిన వారిసంఖ్య 15కు చేరిందని అధికారులు తెలిపారు. Also read: Hyderabad Rains: నగరంలో ఎటుచూసినా నీరే.. హెల్ప్ లైన్ నెంబర్ల జారీ
#WATCH Telangana: A car collides with other cars after getting washed away in New Bowenpally area of Hyderabad.
Heavy downpour has created a flood-like situation in several areas of the state capital. pic.twitter.com/y9nfe09VIO
— ANI (@ANI) October 14, 2020
అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ( IMD ) భాగ్యనగరంలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అయితే వాయుగుండం ప్రస్తుతం మహారాష్ట్ర వైపు కదులుతోందని.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో తెలంగాణ ( Telangana ) రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు రెండు రోజుల సెలవును ప్రకటించింది.
NDRF (National Disaster Response Force) teams have rescued 74 persons till now in Bandangpet area: Satya Pradhan, Director General of NDRF. #HyderabadRains pic.twitter.com/jogottaINd
— ANI (@ANI) October 14, 2020
ఇదిలాఉంటే.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎస్ సిబ్బంది ఇంకా అనేక ప్రాంతాల్లో రెస్క్యూ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నెంబర్లను జారీ చేశారు. Also read: Yellow Alert in Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షాలు, 13 మంది మరణం, ఎల్లో అలెర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe