EAMCET : తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం కానుంది. తొలిరోజు అగ్రికల్చర్ విభాగంలో రెండు విడుతల్లో ఎగ్జామ్ జరగనుంది. తొలి రోజు 57, 775 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. తెలంగాణలో 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
TS Tenth Results 2023: తెలంగాణ పదో తరగతి పరీక్షలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. bse.telangana.gov.in, bseresults.telangana.gov.in Manabadi Telangana వెబ్సైట్లలో విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
హన్మకొండ జిల్లా బీఆర్ఎస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కమలాపుర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మధ్య వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది.
TS Inter 1st year and 2nd Year Results 2023: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తి వివరాలు ఇలా..
KCR Govt : ఈ నెల 9న సాయంత్రం ఐదు గంటల్లోపు పంచాయితీ కార్యదర్శులు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. డ్యూటీలో చేరకపోతే విధుల్లోంచి తొలగిస్తామని హెచ్చరించింది. జూ. పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేయడంపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Bura Narasaish Goud : ఈ నెల 18న నాగోల్లో బీజేపి ఓబీసీ సమ్మేళనం జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను బూర నర్సయ్య గౌడ్ ఆవిష్కరించారు. ఓబీసీ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు.
Revanth Reddy : టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని రేవంత్ రెడ్డి కౌంటర్లు వేశారు. అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియమాకాలు చేపడతామని అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చాడు.
Inter Student Death in Nizamabad: ఇంటర్ ఫస్టియర్లో ఫెయిల్ అయినందుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో ముగినిపోయారు. విద్యార్థులు ఫెయిల్ అయ్యామని దిగులు చెందవద్దని.. సప్లిమెంటరీ రాసుకుని పాస్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
Junior Panchayat Secretary Strike In Telangana: జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చేపట్టిన సమ్మెపై స్పందించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడుతూ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. వారిని రెగ్యులర్ చేయకుండా వేధించడం సరికాదన్నారు.
MLA Muthireddy Yadagiri Reddy Forgery Case: తన కూతురు తుల్జా భవాని రెడ్డిని ప్రత్యర్థులు తనపైకి ఉసిగొల్పుతున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ఆమె స్థలాన్ని తాను కబ్జా చేయలేదని.. ఆమె పేరుపైనే స్థలం ఉందని క్లారిటీ ఇచ్చారు. ఇది కుటుంబ సమస్య అని చెప్పారు.
Priyanka Gandhi : తెలంగాణ అమరవీరులు ఏ లక్ష్యంతో అయితే ఉద్యమం చేశారో.. ఆ లక్ష్యం నెరవేరడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్ నగర్లో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నిప్పులు చెరిగింది.
మణిపూర్ నుంచి తెలుగు విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు ప్రత్యేక విమానాల ద్వారా ప్రభుత్వం వారిని ఇక్కడికి రప్పించింది. ఏపీ విద్యార్థుల కోసం ఎయిర్ పోర్టు వద్ద మూడు బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
Bandi Sanjay on The Kerala Story Movie: సీఎం కేసీఆర్ కూడా ది కేరళ స్టోరీ మూవీ చూడాలని బండి సంజయ్ కోరారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాలో చూపించిన తరహా సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ మూవీలో చూపించింది 5 నుంచి 10 శాతమేనని పేర్కొన్నారు.
Junior Panchayat Secretaries Strike: తమను రెగ్యులరైజ్ చేయాలంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత కొద్దిరోజులుగా సమ్మె చేపట్టారు. తాజా ఈ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రేపటిలోగా సమ్మెను బంద్ చేసి ఉద్యోగాల్లో చేరాలని.. లేకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
Munnur Ravi : తెలంగాణ ఉద్యమ కారుడు మున్నూరు రవిపై దాడి కలకలం సృష్టిస్తోంది. మహబూబ్ నగర్లోని ఓ షాప్ దగ్గర కూర్చుని ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన చెయ్యి, ముక్కుకు గాయాలు తగలడంతో ఆస్పత్రిలో జాయిన్ చేశారు.
Minister Puvvada : మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతోన్నాయని, తనను గెలిపించాలని, తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. కేసీఆర్ వెంట ఉండి వేల కోట్లు సంపాదించిన పొంగులేటి ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని అన్నాడు.
Hyderabad Outer Ring Road Tenders Issue: ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో భారీ అవినీతి జరుగుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎలాగూ అధికారంలోకి రాలేమని బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు.
Police Dept : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్ నగరంలో కొత్తగా నలభై పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని జీవో జారీ చేసింది. హైద్రాబాద్లో పన్నెండు ఏసీపీ జోన్లు, సైబరాబాద్లో మూడు డీసీపీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Amar Raja Company : తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్లో పర్యటించారు. దివిటిపల్లి వద్ద సుమారు రూ. 270 ఎకరాల్లో అమర్ రాజా లిథియం బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
Hyderabad Rains : తెలంగాణలో మరొక రెండ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే హైద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.