ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. (West Godavari) జిల్లా కేంద్రమైన ఏలూరులో చాలామంది ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోవడం, నోట్లో నుంచి నురగలు రావడం, మూర్ఛపోవడం, వాంతులు లాంటి కారణాలతో శనివారం నుంచి ఆసుపత్రుల్లో చేరుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు (AP Formation Day) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో (నవంబర్ 1) 64 ఏళ్లు నిండాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరనుంది. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ( Vijayawada Kanakadurga flyover) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి (Coronavirus) రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. నిత్యం వేలాదిసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు.. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా.. శుక్రవారం సీఎం జగన్ మరో నూతన పథకాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్లో చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు కరోనా (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న సంగతి తెలిసిందే. జూలైలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా (Amzath Basha ) కరోనావైరస్ బారిన పడి కోలుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ (coronavirus ) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సాధారణ ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అధికారపార్టీ వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jaganmohan Reddy) శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీశైలం తెలంగాణ ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ( Srisailam Fire Accident ) దృష్ట్యా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా దేశమంతటా ఈ విద్యా సంవత్సరం ప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )లో జూలై 8న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం వాయిదాపడింది. వైఎస్ఆర్ జయంతి నాడు పట్టాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ( AP govt ) భావించింది. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో దీనిని వాయిదా వేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.