AP Assembly Survey: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటిలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ సమరం కూడా ఉంది. ఆ రాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి ఏపీ ఎన్నికల విషయమై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ కలుగుతోంది. మరోసారి వైఎస్ జగన్ అధికారాన్ని నిలబెట్టుకుంటాడా.. మూకుమ్మడిగా వస్తున్న టీడీపీ, జనసేన కూటమి వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే విడుదలైంది.
YSRCP 5th List: ఎన్నికలకు సిద్ధమైన వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులను కొనసాగిస్తోంది. ఇప్పటికే నాలుగు జాబితాలుగా మార్పులు చేసిన అధికార పార్టీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు పార్టీ ఇన్చార్జీలను మార్చేసింది.
Konda Surekha Enters in AP Politics: ఏపీ సీఎం జగన్‌ను ఇప్పటికే ఇద్దరు చెల్లెళ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా వారిద్దరికీ ఇప్పుడు మరొకరు తోడయ్యారు. ఇప్పుడు జగన్‌ను చెడుగుడు ఆడేందుకు తెలంగాణ అక్క రాబోతున్నది. ఉమ్మడి ఏపీలో జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచిన అక్కడ ఇప్పుడు ఏపీలో అతడికే వ్యతిరేకంగా పని చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆమె ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు.
Ys Jagan Strategy: ఏపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలు, వైనాట్ 175 లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు అధికారం కోసం వైఎస్ జగన్ కొత్త వ్యూహం రచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
All Eyes on Cabinet Meeting: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ సమావేశం భేటీ అవుతుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ సీఎం జగన్ ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా.. ప్రజలకు ఏమైనా తాయిలాలు ప్రకటిస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Sharmila Anantapur Tour: ఆంధ్రప్రదేశ్ తన పుట్టిల్లుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఏపీ కోసం ఎంతదాకైనా పోరాడుతానని, తన కుటుంబాన్ని చీల్చినా వెనుకాడనని స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల అనంతపురంలో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడారు.
IAS Transfers: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అనూహ్యంగా అధికారుల బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడు, నాలుగు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం లభించింది.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ షర్మిల కేంద్రంగా మారాయి. షర్మిల వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిణామాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సీఎం వైఎస్ జగన్‌పై షర్మిల చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. తాజాగా మంత్రి రోజా స్పందిస్తూ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై వైఎస్ షర్మిల స్పందించారు. తన కుటుంబంపై తప్పుడు నిందలు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనలో ప్రవహించేది వైఎస్సార్ రక్తమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ ప్రజలు, బీజేపీ దేశ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు.
Sharmila AP Tour: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునః ప్రవేశించిన వైఎస్ షర్మిల తన సొంత అన్న సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విమర్శల దాడి పెంచారు. సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న షర్మిల విశాఖపట్టణం పర్యటనలో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
AP Rajyasabha Elections: రాజ్యసభ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చక్రం తిప్పుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గురిపెట్టారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sensational Comments: రాజకీయాల్లోకి ప్రవేశించిన తన సోదరి షర్మిలపై తొలిసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆమె పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జాకీలు పెట్టి లేపేందుకు చాలా మంది వస్తున్నారని విమర్శలు చేశారు. తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని స్పష్టం చేశారు.
Ys Jagan Strategy: ఏపీలో ఎన్నికల వాతావరణ వేడెక్కుతోంది. అధికార పార్టీ ఒక్కొక్కటిగా జాబితాలు విడుదల చేస్తుంటే ప్రతిపక్షాలు ఇంకా పొత్తు సమీకరణాలు దాటడం లేదు. ఈలోగా ముఖ్యమంత్రి వైఎెస్ జగన్ మరో రెండు వరాలిచ్చేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
YCP 4th List: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేయగా..మరో జాబితా దాదాపుగా సిద్ధమైంది. సంక్రాంతి కారణంగా ఆలస్యమైన నాలుగో జాబితా త్వరలో విడుదల కానుంది.
Ys Sharmila Son Engagement: ఏపీలో ఇప్పుడు వైఎస్ షర్మిల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఏపీసీసీ పగ్గాలు దక్కడం మరోవైపు కుమారుడి పెళ్లి నిశ్చితార్దం ఆమెను మరోసారి వార్తల్లో నిలుపుతుున్నాయి. ఈ నిశ్చితార్ధానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరౌతారా లేదా అనేది ప్రాధాన్యతాంశంగా మారింది.
Jagananna Agenda Song: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పులు చేర్పులతో అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తూ దుసుకుపోతోంది. మరోవైపు ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని విడుదలైన జగనన్న ఎజెండా పాట వైరల్ అవుతోంది.
Sajjala Comments: ఏపీ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి సమీకరణాలు మరింతగా మారేట్టు కన్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Yatra 2: ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర. 2019 లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. మలయాళ నటుడు మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ పాత్రలో నటించి అలరించాడు. కాగా ఇప్పుడు ఈ చిత్రం రెండవ భాగం కూడా విడుదలకు సిద్ధమవుతోంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.