iPhone SE 4 Launch: ఐఫోన్ కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ బడ్జెట్ కారణంగా అందరూ వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఐఫోన్‌లో కూడా చీప్ అండ్ బెస్ట్ ఉందని చాలామందికి తెలియదు. అదే iPhoneలో SE సిరీస్. ఈ సిరీస్ ఫోన్లు మిగిలిన ఐఫోన్ల కంటే ధర చాలా తక్కువ ఉంటాయి. అదే ఇప్పుడు లాంచ్ అవుతోంది.
iPhone SE సిరీస్‌లో ఇప్పటి వరకూ మూడు మోడల్స్ ఉన్నాయి. iPhone SE 3 వచ్చి మూడేళ్లు అయింది. ఇప్పుడు తిరిగి iPhone SE 4 లాంచ్ చేస్తోంది కంపెనీ. ఇందులో కూడా ఐఫోన్ 16 చిప్‌సెట్ ఉంటుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది. కెమేరా ఇతర ఫీచర్ల విషయంలో చాలా అప్ గ్రేడెడ్ మోడల్ ఇది. వాస్తవానికి iPhone SE 4 కోసం చాలా కాలంగా నిరీక్షణ ఉంది. ఐఫోన్ కొనాలనుకుని బడ్జెట్ కారణంగా వెనుకడుగు వేసేవారికి ఇది మంచి ఆప్షన్. iPhone SE 4 చూడ్డానికి ఐఫోన్ 14 లా ఉంటుందని తెలుస్తోంది. అల్యూమినియం, గ్లాస్ బాడీ ఉంటుంది. డ్యూరబిలిటీ పెంచేందుకు దీనికి సిరామిక్ షీల్డ్ అమర్చింది. టచ్ ఐడీ స్థానంలో ఫేస్ ఐడీ ఉంటుంది.
iPhone SE 4 ధర ఇండియాలో 50 వేలు ఉండవచ్చు. ఇది 6.1 ఇంచెస్ ఓఎల్ఈడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. iPhone SE 3 మత్రం 4.7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సిడీ స్క్రీన్ కలిగి ఉంది. iPhone SE 4 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఏ18 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 16లో కూడా ఇదే వినియోగించారు. అయితే ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుండటం విశేషం. ఇందులో 8జీబీ ర్యామ్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ రేర్ సెన్సార్, 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటాయి. iPhone SE3లో మాత్రం కేవలం 12 మెగాపిక్సెల్ కెమేరా ఉండేది. ఇక బ్యాటరీ సామర్ధ్యం అయితే 3,727 ఎంఏహెచ్ ఉంటుంది. టైప్ సి ఛార్జర్ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి