Smartwatch Under Rs. 2000: మారుతున్న జీవన శైలిని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ వాచ్ కంపెనీలు కొత్త కొత్త కాలింగ్ వాచ్‌లను రిలీజ్‌చేస్తున్నాయి. అయితే ఇటీవలే భారత్‌లో స్థాపించిన పోర్ట్రోనిక్స్ కంపెనీ కూడా తమ మొదటి స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరతో మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. పోర్ట్రోనిక్స్ తమ మోడల్ క్రోనోస్ X4ని ఇప్పటికే మార్కెట్‌లో లాంచ్ చేశారు. ఆత్యధునిక స్పెసిఫికేషన్స్‌తో మంచి ఫీచర్స్‌తో రిలీజ్ అయిన ఈ ఫోన్ తక్కువ ధరకే లభించనుంది. అయితే దీని ధర ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోర్ట్రోనిక్స్ క్రోనోస్ X4 స్పెసిఫికేషన్స్:
పోర్ట్రోనిక్స్ క్రోనోస్ X4 HD రిజల్యూషన్‌తో 1.85-అంగుళాల డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి విడుదలైంది. ఇది డైనమిక్ వాచ్ ఫేస్‌ను కలిగి ఉంది. కాబట్టి ఇతరలకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వాచ్ మెటల్ ఛాసిస్ పరికరం కలిగి ఉంటుంది. కుడి వైపున ఫిజికల్ బటన్‌ను కలిగి ఉండి.. IP68-సర్టిఫైడ్ వాటర్-రెసిస్టెంట్‌తో వచ్చింది. పోర్ట్‌రోనిక్స్ క్రోనోస్ X4 హార్ట్‌బీట్ సెన్సార్, SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకర్, బ్రీతింగ్ సెన్సార్‌ను కూడా అమర్చారు. ఇది సైక్లింగ్, యోగా, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, రన్నింగ్ ఇతర ట్రాకింగ్ సెన్సార్స్‌ను కూడా అమర్చారు.
పోర్ట్రోనిక్స్ క్రోనోస్ X4 బ్యాటరీ:
పోర్ట్రోనిక్స్ క్రోనోస్ X4 HD మైక్రోఫోన్‌తో తయారు చేశారు. దీంతో నేరుగా ఫోన్ దూరంగా ఉన్న కాల్స్ కూడా సులభంగా మాట్లాడుకొవచ్చు. అంతేకాకుండా బయటకు వినబడేందుకు లౌవుడ్ స్పీకర్స్‌ను కూడా ఈ వాచ్ అమర్చారు. ఇది బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి సపోర్ట్‌తో పని చేస్తుంది. ఇక సంగీత ప్రియులు నేరుగా ఇందులో పాటలు కూడా వినొచ్చని కంపెనీ పేర్కొంది. పోర్ట్రోనిక్స్ క్రోనోస్ X4 260 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది మీకు చాలా రోజుల దాకా చార్జ్ చేయకపోయిన వర్క్ చేస్తుంది.
భారత్‌లో పోర్ట్రోనిక్స్ క్రోనోస్ X4 ధర:
భారత్‌లో ఈ వాచ్ మూడు(నలుపు, నీలం, గ్రే) రంగుల్లో లభిస్తోంది. అయితే ఈ దీని ధర విషయానికొస్తే సాధర వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కేవలం రూ. 2,999కే మార్కెట్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా సులభంగా లభిస్తోంది.
Also Read: Nani Sister Deepthi : సెట్‌లో హీరోయిన్లతో నాని అక్క అలా చేయించుకుందా?.. సినిమా ఆఫర్ కోసం ఇలానా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook