Hero Xtreme 163R 4V Price: ప్రముఖ మోటర్‌కంపెనీ హీరో మార్కెట్‌లోకి అద్భుతమైన స్కూటర్స్‌తో పాటు మోటర్ సైకిల్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ప్రీమియంమ ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే కొన్ని హీరో మోటర్‌సైకిల్స్ చీప్ ధరలోనే ఎక్కువ మైలేజీలో విడుదలవుతున్నాయి. ముఖ్యంగా హీరో కంపెనీ మార్కెట్‌లో యువతను దృష్టిలో పెట్టుకుని ఇటీవలే ఎక్స్‌ట్రీమ్ 163R 4V మోటర్‌సైకిల్ లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
హీరో ఎక్స్‌ట్రీమ్ 163R 4V (Hero Xtreme 163R 4V) మోటర్‌సైకిల్ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే మార్కెట్‌లో ఈ బైక్‌కి మంచి ప్రజాదరణ లభించడంతో దీనికి సంబంధించిన సేల్స్ విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా దీనిని యువత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణాలు ఫీచర్స్ అని ఆటో నిపుణులు తెలుపుతున్నారు. హీరో ఎక్స్‌ట్రీమ్ 163R 4V బైక్ ప్రీమియం ఎలక్ట్రానిక్ మీటర్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా స్పెషల్ బ్లూటూత్ కనెక్టివిటీని కూడా అందిస్తోంది. అలాగే అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందించేందుకు ప్రత్యేకమైన సీటింగ్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ ఎక్స్‌ట్రీమ్ 163R 4V బైక్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది మార్కెట్‌లో ధర రూ.1.38తో అందుబాటులో ఉంది. ఇక మోటర్‌సైకిల్ లీటర్ పెట్రోల్‌కి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ ఎంతో శక్తివంతమైన 163.2cc BS6 ఇంజన్‌తో విడుదలైంది. అంతేకాకుండా ఇది 16.6 bhp శక్తితో పాటు 14.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది స్పెషల్ బ్రెకింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ బైక్ 12 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే స్పెషల్ డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలిపింది.
AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు
ఈ హీరో ఎక్స్‌ట్రీమ్ 163R 4V (Hero Xtreme 163R 4V) మోటర్‌సైకిల్ వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇందులో స్పెషల్ టైర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ బైక్ ఆఫ్‌రోడ్ చేసేందుకు కూడా చాలా బాగుంటుంది. ఇది మ్యాట్ స్లేట్ బ్లాక్ కలర్‌తో పాటు నియాన్ షూటింగ్ స్టార్ కలర్ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ప్రీమియం బాడీ గ్రాఫిక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే హీరో కంపెనీ కూడా త్వరలోనే ఎక్స్‌ట్రీమ్‌ను నూతన మోడల్‌ను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి