Huawei Mate Xt Triple Foldable Phone: ట్రిపుల్ ఫోల్డబుల్ ఎప్పుడైనా చూశారా? అవును ఇలా చేప్తే అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. త్వరలోనే మార్కెట్‌లోకి మూడు మడతల ఫోల్డబుల్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో రానుంది. దీనిని ప్రముఖ చైనీస్ కంపెనీ Huawei అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని కంపెనీ Mate XT పేరుతో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీనిని విడుదల చేస్తే.. ప్రపంచంలోనే మొదటి ట్రై-ఫోల్డ్ ఫోన్ అవుతుంది. Huawei కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 10న అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ప్రీ బుకింగ్ కూడా చైనా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ JD.comలో స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ బుకింగ్‌లో భాగంగా 7 లక్షలకు పైగా మంది ప్రీబుకింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రీ-బుకింగ్ ప్రారంభమైన అనేక రోజులవుతున్న కంపెనీ మాత్రం ఈ Huawei Mate XT అల్టిమేట్ స్మార్ట్‌ఫోన్ ధరను అధికారికంగా ప్రకటించలేదు. ఈ మొబైల్ మార్కెట్‌లో మంచి సక్సెస్ సాధిస్తే.. Huawei కంపెనీ త్వరలోనే మరో ట్రై-ఫోల్డ్ మొబైల్‌ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే లాంచ్ అయిన Tecno Phantom Ultimate 2 మొబైల్ లాగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఇదీ అన్ని ఫోల్డ్ మొబైల్స్ కంటే చాలా భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఈ Huawei Mate XT అల్టిమేట్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 19 వరకు కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ సంబంధించిన మొదటి సేల్ సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులోని మొదటి వేరియంట్ 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్, ఇక రెండవ వేరియంట్ 16GB ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. ఇది రెండు కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డెన్, డార్క్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, సుమారు రూ. 1.77 లక్షలు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
హువావే మేట్ XT ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్
ట్రిపుల్ ఫోల్డింగ్ డిజైన్
అధిక రిఫ్రెష్ రేట్ OLED డిస్ప్లే
పవర్‌ఫుల్ ప్రాసెసర్
అధిక కెపాసిటీ బ్యాటరీ
5G కనెక్టివిటీ
అద్భుతమైన కెమెరా సెటప్
అంతర్నిర్మిత స్టైలస్
IP రేటింగ్
అధునాతన ఆపరేటింగ్ సిస్టమ్
ప్రీమియం బిల్డ్ క్వాలిటీ
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.