Huawei Pura 80 Ultra Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హువావే తమ కస్టమర్స్‌కి గుడ్‌న్యూస్ తెలిపింది. తమ మోస్ట్ పవర్‌ఫుల్ కొత్త టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ మొబైల్ హువావే పురా 80 అల్ట్రా పేరుతో లాంచ్ కానుంది. ఇది ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇతర బ్రాండ్‌కి సంబంధించిన కెమెరా సెన్సార్లకు కూడా అమర్చినట్లు సోషల్ వీడియాలో అనేక లీక్‌లు వైరల్ అయ్యాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హువావే పురా 80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా దీనికి బ్యాక్‌లో పెద్ద 1-అంగుళాల సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి షాట్ అద్భుతంగా ఉండేందుకు ఈ మొబైల్‌లో ప్రత్యేకమైన సెన్సార్స్ కూడా లభించబోతున్నాయి. దీంతో పాటు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే స్పెషల్ జూబ్ కలిగిన ప్రీమియం సెన్సార్స్‌ను కూడా అందిస్తోంది. ఇందులో సెకండరీ కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
హువావే కంపెనీ మార్కెట్‌లోకి ఎప్పుడు స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేసిన అద్భుతమైన డిజన్స్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా దీని బ్యాక్ సెటప్‌లో ప్రీమియం కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే 6.8-అంగుళాల డిస్ప్లేతో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ డిస్ల్పే చూడడానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. కాబట్టి గేమింగ్ చేసేవారికి చాలా బాగా పని చేస్తుంది. దీంతో పాటు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేందుకు కూడా చాలా వీలవుతుంది. దీని క్రీన్ అధిక రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి యానిమేషన్‌లు, స్క్రోలింగ్ చాలా సున్నితంగా అనిపించేలా చేస్తుందని లీక్ అయిన వివరాల్లో పేర్కొన్నారు.
ఇక ఈ హువావే స్మార్ట్‌ఫోన్ అత్యంత శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను ప్యాక్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ పురా 80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విభిన్న కలర్ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. అలాగే ఇది మోస్ట్‌పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో విడుదల కానుంది. ఈ మొబైల్ హువావే సొంత ప్యూర్ హాంగ్‌మెంగ్ OSపై రన్ కానుంది. అంతేకాకుండా అద్భుతమైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. అలాగే దీనిని కంపెనీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అధికారిక విడుదల తేదిని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే త్వరలోనే ప్రకటించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి