Iqoo Neo 10R Price In India: ఐక్యూ మొబైల్స్ మార్కెట్‌లో తిరుగులేని స్మార్ట్‌ఫోన్స్‌గా మంచి ప్రజాదరణ పొందాయి. ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అతి తక్కువ ధరల్లోనే లభించడం వల్ల చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అలాగే అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల కావడం వల్ల గేమింగ్ చేసే విద్యార్థులు కూడా వీటిని కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఐకూ మరో గుడ్‌న్యూస్ తెలపబోతోంది.
త్వరలోనే ఈ ఐకూ కంపెనీ ఎంతో శక్తివంతమైన iQOO నియో 10R (Iqoo Neo 10R) స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అలాగే ఈ మొబైల్‌కి సంబంధించిన పనితీరు, వేగాన్ని కూడా పరీక్షించినట్లు తెలిపారు. దీంతో పాటు ఇప్పటికే ఇది పరీక్షలను నిర్వహించే వెబ్‌సైట్ Geekbenchలో ప్రత్యేక్షమైంది. ఈ iQOO నియో 10R స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పరీక్ష వివరాల్లోకి వెళితే.. ఇది మల్టీ-కోర్ పనితీరులో 5,062 స్కోర్ సాధించినట్లు తెలిపారు. అంతేకాకుండా వివిధ పరీక్షల్లో కూడా మంచ స్కోర్ సంపాదించుకున్నట్లు టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ మొబైల్‌ను గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ చేసేవారి కోసం తయారు చేసినట్లు తెలిపారు.
ఈ iQOO Neo 10R (Iqoo Neo 10R) స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే 12GB ర్యామ్‌తో పాటు అద్భుతమైన ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌ల విడుదల కానుంది. ఇది మల్టీ టాస్కింగ్ చేసేవారికి ఈ మొబైల్ చాలా అద్బుతంగా ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ న్యూ వెర్షన్ అయిన Android 15పై రన్ కాబోతోంది. ఈ గీక్‌బెంచ్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ iQOO నియో 10R స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాల్లో వెళ్లడైంది. ముఖ్యంగా స్క్రోలింగ్ చేసేవారికి చాలా బాగుంటుంది.
అలాగే ఈ మొబైల్ (Iqoo Neo 10R) ఎంతో శక్తివంతమైన 6,400mAh బ్యాటరీతో వస్తోంది. దీంతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మార్చి 11న అధికారికంగా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఫీచర్స్, ఇతర వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇది మార్కెట్‌లోకి విడుదలైతే.. సాంసంగ్ మొబైల్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
AlsoRead: Spitting Red King Cobra: కళ్లలోకి విషం చిమ్మే అరుదైన రెడ్ కింగ్ కోబ్రా.. వీడియో చూసే ధైర్యం మీకుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి