Ligier Mini EV: కేవలం రూ.1 లక్షకే.. 192 కి.మీ మైలేజీ EV కారు వస్తోంది.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!

Ligier Mini EV Under 1L: త్వరలోనే భారత మార్కెట్‌లోకి రూ.1 లక్షకే ఎలక్ట్రిక్ కారు లాంచ్‌ అయ్యింది. అదేంటో కాదు లిజియర్ మినీ EV కారు.. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 21, 2025, 05:52 PM IST
Ligier Mini EV: కేవలం రూ.1 లక్షకే.. 192 కి.మీ మైలేజీ EV కారు వస్తోంది.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!

Ligier Mini EV Under 1L: గతంలో పోలిస్తే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ప్రజాదరణ లభిస్తూ వస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో అత్యధిక మైలేజీతో తక్కువ ధరల్లో అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని కార్ల తయారీ కంపెనీలు అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేస్తూ.. విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్‌లో అతి తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో లభించే కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అతి చౌకగా లిజియర్ అనే కార్ల కంపెనీ కొత్త ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. అయితే దీనికి సంబంధించని పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.

ప్రముఖ కార్ల కంపెనీ లిజియర్ విడుదల చేసి ఎలక్ట్రిక్‌ కారు అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు శక్తివంతమైన ఇంజన్‌తో లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ కేవలం ధర రూ.1లోపే సేల్‌ చేసేందుకు యోచిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందించే అవకాశాలు కూడా ఉన్నట్లు మార్కెట్‌లో టాక్‌ నడుస్తోంది. అంతేకాకుండా ఈ కాంపాక్ట్ EV కారు భారత మార్కెట్‌లోకి విడుదలైతే పెద్ద ప్రభజం సృష్టించే ఛాన్స్‌ కూడా ఉందని ఆటో నిపుణులు తెలుపుతున్నారు. 

ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ అందుబాటులోకి తీసుకు రాబోయే లిజియర్ మినీ EV డిజైన్‌ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇది మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తే.. గతంలో విడుదలైన MG కామెట్ EV కారుతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ MG కామెట్ కార్ల సేల్స్‌ కూడా పడిపోయే ఛాన్స్‌ కూడా ఉందని ఆటో నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో పాటు రివర్స్ కెమెరా సెటప్‌తో లభించనుంది.

Read more: CM Revanth Reddy: రంజాన్ వేళ ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. స్టోరీ ఏంటంటే..?

ఈ కారులో ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ ఆటో ఇంటిగ్రేషన్‌తో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందిస్తోంది. అలాగే స్పెషల్ మోడల్స్‌లో  ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు నాలుగు నుంచి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కూడా కలిగి ఉంటుంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ కార్లలో 12.42 kWh బ్యాటరీ కూడా లభిస్తోంది. దీనికి తోడు ప్రత్యేకమైన కూలింగ్‌ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 192 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా అనేక రకాల ఫీచర్స్‌ ఈ కారులో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 

Read more: CM Revanth Reddy: రంజాన్ వేళ ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. స్టోరీ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News