OnePlus: OnePlus Nord CE 4 Lite ఫోన్ ఇవాళ లాంచ్ కానుంది. ఆపిల్, శాంసంగ్ ఫోన్ తరువాత వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇవాళ లాంచ్ అవుతున్న వన్‌ప్లస్ కొత్త ఫోన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5500 ఎఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 2100 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం వల్ల అద్భుతమైన రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది.
ఇవాళ సాయంత్రం 7 గంటలకు లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర 20 వేల వరకూ ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ కంటే కాస్త తక్కువ ఫీచర్లతో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 మాత్రం 24,999 రూపాయలకు విక్రయమౌతోంది.
Also read: SIP Investment Tips: మ్యూచ్యువల్ ఫండ్ SIPతో కోటి రూపాయలు సంపాదించవచ్చు, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook