Oppo A3X Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఒప్పో నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. ఇది కొత్త A సిరీస్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ Oppo A3x పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇది అద్భుతమైన బిల్ట్ క్వాలిటీతో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Oppo A3x స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్ వివరాలను TheTechOutlook వెబ్సైట్లో పంచుకుంది. ఇది లిక్విడ్ రెసిస్టెంట్ రేటింగ్ సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని బ్యాక్ సెటప్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ వస్తోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళితే, ఇది ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది పోస్టర్ చిత్రం మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మల్టీ లిక్విడ్ రెసిస్టెంట్ ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తుంది. దీంతో పాటు 120Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ డిస్ల్పేతో వస్తోంది. డిస్ల్పే ముందు భాగంలో పంచ్ హోల్ కటౌట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఎంతో ఆకర్శనీయమైన కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు అంచుల భాగంలో గుండ్రని సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో తేలికపాటి బెజెల్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ కుడి వైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్లతో కూడి ఉంటుంది. అంతేకాకుండా ఎడమ వైపున SIM ట్రే కూడా ఉంటుంది. అంతేకాకుండా ఫ్లికర్ బ్రైట్నెస్ డిటెక్షన్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే బ్యాక్ సెటప్‌లో 8-మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రానుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ఆండ్రాయిడ్ 14 OS ఆధారంగా ColorOS 14
డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
5100mAh బ్యాటరీ
4GB ర్యామ్, 64GB స్టోరేజ్
4GB ర్యామ్,128GB స్టోరేజ్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి