Oppo F27 Pro Plus: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పోకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ప్రీమియం ఫీచర్స్ కెమెరా కలిగిన మొబైల్స్‌ను లాంచ్ చేయడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ ఒప్పో(Oppo) కంపెనీ త్వరలోనే గుడ్ న్యూస్ అందించబోతోంది. త్వరలోనే ఎంతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనిని కంపెనీ Oppo F27 సిరీస్ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇది IP69 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఒప్పో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను Oppo F27 , F27 Proతో పాటు F27 Pro+ మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ మొబైల్‌ను జూన్ 13న లాంచ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఇటీవలే చైనాలో విడుదలైనా Oppo A3 ప్రోకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా అందుబాటులో రాబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్స్ వెల్లడించారు.
ఈ స్మార్ట్‌ఫోన్స్ అత్యంత ప్రీమియం IP69 రేటింగ్‌తో వస్తోంది. ఇది నీటిలో ముంచిన కొన్ని నిమిషాల పాటు పాడవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు అద్భుతమైన రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు F27 ప్రో మొబైల్లో మాత్రం 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ మొబైల్ బ్యాక్ సెటప్‌లో కెమెరా మాడ్యూల్ బ్లూ మెటల్ రింగ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో ప్రత్యేకమైన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక Oppo F25 Pro స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో రానుంది. దీంతో పాటు 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఈ మొబైల్ ప్రాసెసర్ వివరాల్లోకి వెళితే, ఇది డైమెన్షన్ 7050 చిప్సెట్తో రానుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇతర ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
త్రిపుల్ కెమెరా సెటప్
LED ఫ్లాష్
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరా
5000mAh బ్యాటరీ
67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి