Oppo Find N5 Price: ప్రపంచంలోనే అత్యంత సన్నని Oppo మొబైల్ వస్తోంది.. ఫీచర్స్‌, ధర లీక్‌!

Oppo Find N5 Price: ఎంతో శక్తివంతమైన ఒప్పో ఫైండ్ N5 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది అద్బుతమైన కెమెరా ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 21, 2025, 01:43 PM IST
Oppo Find N5 Price: ప్రపంచంలోనే అత్యంత సన్నని Oppo మొబైల్ వస్తోంది.. ఫీచర్స్‌, ధర లీక్‌!

Oppo Find N5 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో త్వరలోనే తమ కస్టమర్స్‌కి బిగ్ గుడ్‌న్యూస్‌ తెలపబోతోంది. తమ ఎంట్రీ లెవల్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ఫైండ్ N5ను విడుదల చేయబోతోంది. ఇది అత్యంత ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే దీనిని కంపెనీ ఫోల్డబుల్ సిరీస్‌లో అందుబాటులోకి తీసుకు రానున్నారు. అయితే ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన డిజైన్‌, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్లిమ్, స్టైలిష్ డిజైన్:
ఈ ఒప్పో ఫైండ్ N5 స్మార్ట్‌ఫోన్‌ అత్యంత సన్నంగా ఉండబోతోంది. అలాగే దీనిని కంపెనీ 4.21mm మందంతో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్‌ కూడా సోషల్ మీడియాలో లీక్‌ అయ్యింది. దీని బట్టి చూస్తే, ఇది మొట్టమొదటి సారిగా కార్బన్ ఫైబర్‌తో పాటు అల్యూమినియం ఫ్రేమ్‌తో లాంచ్‌ కానుంది. దీంతో పాటు ఇది పూర్తి నాచ్‌ డిస్ల్పేను కూడా కలిగి ఉండబోతోంది. ఇక ఈ ఒప్పో ఫైండ్ N5 స్మార్ట్‌ఫోన్‌లో 8.12-అంగుళాల అద్భుతమైన పెద్ద డిస్ప్లేను అందిస్తోంది. దీంతో పాటు స్క్రీన్‌ స్మూత్‌గా ఉండడానికి ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది.

ఒప్పో ఫైండ్ N5 మొబైల్‌ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తోంది. ఈ మొబైల్‌లో కంపెనీ ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది. దీని బెస్‌ వేరియంట్‌ 16GB ర్యామ్‌తో పాటు 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో విడుదల అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్‌ ColorOS 15తో Android 15పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో నాలుగు సంవత్సరాల సాఫ్ట్‌వేర్‌ అప్డేట్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ప్రీమియం ఫీచర్స్‌ అనేక రకాల AI     ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. దీనిని బ్యాక్‌ సెటప్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన  50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఎంతో శక్తివంతమైన 5,600mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు  50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక దీని ధర రూ. 1,55,000 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే కంపెనీ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. 

Also read: Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News