Poco Pad 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో(Poco) భారత కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలపబోతోంది. తమ మొట్ట మొదటి ట్యాబ్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది 5G కనెక్టివిటీతో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ పోకో ప్యాడ్ పేరుతో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ మొబైల్ 5G వెర్షన్ BIS సైట్‌లో కనిపించింది. ఈ ట్యాబ్‌ను కంపెనీ త్వరలోనే గ్లోబల్ లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. Poco కంపెనీ ఈ ప్యాడ్‌ని ప్రపంచవ్యాప్తంగా Wi-Fi కనెక్టివిటీ వేరియంట్‌లలో విడుదల చేయగా భారత్‌లో మాత్రం ఫైవ్‌జీ కనెక్షన్ సెటప్‌తో అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే ఈ ట్యాబ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలసుకుందాం.
POCO ప్యాడ్ గురించి BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సైట్‌లో క్లుప్తంగా వివరించారు. దీనిని కంపెనీ 24074PCD2I మోడల్ నంబర్‌తో అందుబాటులోకి ఈ ట్యాబ్ గతంలో లాంచ్ అయిన రెడ్‌మి ప్యాడ్ ప్రో 5 జికి చాలా పోలి ఉండబోతున్నట్లు ప్రముఖ టిప్ స్టర్స్ తెలిపారు. ఇది 24074RPD2I మోడల్ నంబర్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి అందిరికీ తెలిసిందే. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే POCO ప్యాడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ట్యాబ్ స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, ఇది రెడ్‌మీ కంపెనీ గతంలో లాంచ్ చేసిన Redmi Pad Pro, Redmi Pad Pro 5G ట్యాబ్ స్పెషిఫికేషన్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ లాంచింగ్‌లో భాగంగా పోకో కంపెనీ ఈ ట్యాబ్‌ను 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇక ఈ ట్యాబ్ Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో రాబోతోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
POCO ప్యాడ్ ట్యాబ్ 2.5K రిజల్యూషన్ డిస్ప్లేతో అందుబాటులోకి తీసుకు రానుంది. దీంతో పాటు 12.1-అంగుళాల LCD డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 500 nits బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ రాబోతోంది. ఈ ప్యాడ్‌ను కంపెనీ 10000mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రానుంది. దీంతో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డబుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ ట్యాబ్ బ్యాక్ సెటప్‌లో 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో పాటు ఫ్రాంట్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌తో రానుంది. ఈ ఫ్యాడ్ ధర దాదాపు సుమారు రూ. 25,000 నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి