Portronics Harmony Mini Price: ప్రస్తుతం చాలా మంది యువత ఎక్కువగా ట్రెక్కింగ్ చేసే క్రమంలో బ్లూటూత్ స్పీకర్స్‌ను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా పార్టీలకు కూడా ఈ స్పీకర్స్‌ను వాడుతున్నారు. దీంతో క్రమంగా వీటి డిమాండ్ పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని టెక్ కంపెనీలు తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు మార్కెట్‌లో చాలా కంపెనీలకు సంబంధించిన బ్లూటూత్ స్పీకర్స్ లాంచ్ అయ్యాయి. ఇందులో పోర్ట్రోనిక్స్ (Portronics) విక్రయాల్లో దుమ్మలేపుతోంది. అలాగే మార్కెట్‌లో తమ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. అంతేకాకుండా ఇటీవలే కొత్త మోడల్‌ను కూడా లాంచ్ చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ పోర్ట్రోనిక్స్ ఇటీవలే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన బ్లూటూత్ స్పీకర్ హార్మొనీ మినీని లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది అద్భుతమైన ఆడియో అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా ఇది ట్రావెలింగ్ చేసేవారికి మంచి సౌండ్ కిట్‌గా పని చేస్తుంది. అయితే కంపెనీ ఈ బ్లూటూత్ స్పీకర్‌ను డెడ్ చీప్ ధరలోనే అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని కంపెనీ కేవలం రూ.2,999కే విక్రయిస్తోంది. దీంతో పాటు ఇప్పటికే వీటినిన పోర్ట్రోనిక్స్ (Portronics) కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ వెబ్‌సైట్స్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో పాటు కొన్నింటిలో ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
పోర్ట్రోనిక్స్ హార్మొనీ మినీ ఫీచర్స్:
ఈ పోర్ట్రోనిక్స్ హార్మొనీ మినీ బ్లూటూత్ స్పీకర్ 25 వాట్ HD సౌండ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా గొప్ప సంగీత అనుభవాన్ని అందిస్తుంది. దీంతో పాటు ప్రీమియం బాస్‌ను కూడా అందించేందుకు ప్రత్యేకమైన స్పీచర్స్‌ను అందుబాటులో ఉంచింది. ఇవే కాకుండా స్సీకర్ లోపలోనే ప్రత్యేకమైన సబ్ వూఫర్‌ని కూడా అందిస్తోంది. దీంతో పాటు పర్ఫెక్ట్ పార్టీ స్పీకర్‌గా పనిచేందుకు వివిధ రకాల మోడ్‌లను కూడా కలిగి ఉంటుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వచ్చింది. దీంతో పాటు AUX-In, USB కనెక్టివిటీ సెటప్‌లను కూడా అందిస్తోంది. అలాగే అద్భతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
25 వాట్ల శక్తివంతమైన ఆడియో సౌండ్
అద్భుతమైన డిజైన్ కోసం RGB లైట్లు
TWS మోడ్‌లు
ఈక్వలైజర్ సెట్టింగ
12 నెలల వారంటీ
6 గంటల వరకు ప్లే టైమ్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.